Savitri: సావిత్రి మెడలో వేసిన పూలదండ వేలం వేస్తే ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా..?

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశారు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది.

Savitri: సావిత్రి మెడలో వేసిన పూలదండ వేలం వేస్తే ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా..?
Mahanati Savitri
Follow us

|

Updated on: Sep 27, 2024 | 11:24 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి . ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాత్రకు ప్రాణం పోయడం ఆమెకే సాధ్యం అన్నంతగా జీవిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సావిత్రి. సావిత్రి చేయలేని పాత్ర ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ఇండస్ట్రీలో మహామహుల సినిమాల్లో నటించి.. తిరుగులేని తారగా ఎదిగింది. ఆమె నటనను చూసి దిగ్గజ నటులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, ఎస్వీ రంగారావులాంటి మహానటులను సైతం అవాక్ అయ్యేలా చేసింది ఆ మహానటి.

ఇది కూడా చదవండి :Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశారు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీ రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది.

ఇది కూడా చదవండి :Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

ఇక సావిత్రి దాన గుణం గురించి అందరికి తెలిసిందే.. ఎన్నో దానాలు చేసింది సావిత్రి. ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విపత్తు కోసం నిధిని సేకరించారట. ఆ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రీవి నరసింహారావుగారు ఉన్నారట. అయితే విపత్తు నిధికి సినిమావాళ్లు పెద్దగా స్పందించలేదట. దాంతో పీవీ నరసింహారావు సావిత్రి మేడలో వేసిన పూల దండను వేలం పాట వేశారట. ఆ పూల మాలను వేలంలో కొనేందుకు జనాలు ఎగబడ్డారట. చివరకు ఆ పూల దండ.. అప్పట్లోనే రూ. 30 వేలు పలికిందట. అప్పుడు రూ. 30 వేలు అంటే ఇప్పుడు రూ. 30 లక్షల కన్నా ఎక్కువే.. అలాగే ఈమె ప్రభుత్వానికి కూడా ఎన్నో విరాళాలు ఇచ్చారట. ఈ విషయాలను మరో సీనియర్ నటి జామున గతంలో తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.