Samantha: అప్పుడు మనసుతో మౌన యుద్ధం.. ఇప్పుడు మయోసైటిస్‌తో మహా యుద్ధం.. సామ్ లోతైన పోస్ట్

గతం ఎన్నో గాయాలు చేసింది. వర్తమానం ఓ భయంకర వ్యాధితో పోరాడేలా చేస్తోంది. మనసుకు, మనిషికి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఇంకా తగులుతూనే ఉన్నాయి. అప్పుడు మనసుతో మౌనయుద్ధం చేసింది. ఇప్పుడు మయోసైటిస్‌తో పోరాడుతోంది.

Samantha: అప్పుడు మనసుతో మౌన యుద్ధం.. ఇప్పుడు మయోసైటిస్‌తో మహా యుద్ధం.. సామ్ లోతైన పోస్ట్
Samantha Ruth Prabhu
Follow us

|

Updated on: Jan 13, 2023 | 6:39 PM

ఏమాయచేసావే అంటూ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది సమంత. తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే నాగచైతన్యను ప్రేమ వివాహాం చేసుకుంది సామ్. పెళ్లి తర్వాత సమంత లేడీ ఒరియేంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది సమంత. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అంటూ పిలుచుకునేవారు అక్కినేని అభిమానులు. కానీ వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లుగా 2021, అక్టోబర్ 2న ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఈ జంట విడిపోవడానికి కారణాలను మాత్రం బయటపెట్టలేదు. విడాకుల అనంతరం తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టింది సమంత. ఇప్పటివరకు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలపై సమంతగానీ, నాగచైతన్య గానీ స్పందించలేదు.

తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకెళ్తున్న సమంతను మయోసైటిస్ వ్యాధి కుంగదీసింది. విడాకుల ఫేజ్ వీడకముందే ఈ వ్యాధి సామ్‌ను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది. అయినప్పటికీ ఆమె ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. గతమంతా తన జీవితంలో ఎన్నెన్నో సుడిగుండాలను ఎదుర్కొన్నా సముద్రమంత సహనాన్నీ, ఆకాశమంత ఔదార్యాన్ని ప్రదర్శించారు. గతకాలపు అనుభవాలతో జీవితానికి ఎలా ఎదురీదాలో  పరిస్థితులు తనకు నేర్పాయన్నారు సమంత. ఇటీవల శాకుంతల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన సమంత లుక్‌ని అభిమానులు చాలా వర్రీ అవుతున్నారు. అయితే సమంత ఆథ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారని ఆమె క్యారీ చేస్తున్న జపమాలను బట్టి అర్థం అవుతుంది.

అయితే తాజాగా సమంత ఇన్ స్టా పెట్టిన పోస్ట్.. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ‘ఒరిజినల్‌ పర్సనాలిటీ ఎవరికైనా స్వేచ్ఛను ఇస్తుంది. అదే ఓ పాత్రలో నటించాలంటే ఫీలింగ్స్‌కి వాస్తవికతకు దూరంగా ఉంటూ ఓ మాస్క్‌ ధరిస్తాం. అలాంటిది మార్పు అన్నది ముందు ఒక వ్యక్తి స్థాయిలో జరగాలి. అంతర్గతంగా మనస్సులో ముందు కదలిక రావాలి’ అంటూ ఓ అమెరికన్ సింగర్, కవి అయిన మోరీసన్ కోట్‌ను షేర్ చేశారు సామ్.

Sam

Sam

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.