Samantha: సమంత ఇస్తున్న స్వీట్ వార్నింగ్ వారికేనా.. సామ్ కోపానికి కారణం ఏంటి

నాకు నువ్వు ఎదురొచ్చినా, నేను నీకు ఎదురుపడ్డా.. దబిడి దిబిడే అంటున్నారు రామలక్ష్మి. నేనింతే టైపులో దూసుకెళ్తున్న ఓ బేబీ సమంత..

Samantha: సమంత ఇస్తున్న స్వీట్ వార్నింగ్ వారికేనా.. సామ్ కోపానికి కారణం ఏంటి
Samanatha
Rajeev Rayala

|

Apr 25, 2022 | 8:51 PM

నాకు నువ్వు ఎదురొచ్చినా, నేను నీకు ఎదురుపడ్డా.. దబిడి దిబిడే అంటున్నారు రామలక్ష్మి. నేనింతే టైపులో దూసుకెళ్తున్న ఓ బేబీ సమంత( Samantha).. మళ్లీ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆన్‌ స్క్రీనైనా, ఆఫ్‌ స్క్రీనైనా ఆమెతో వ్యవహారం మామూలుగా వుండదని మరోసారి డిక్లేర్ అయింది. నేను బ్యూటిఫుల్లే కాదు బోల్డు కూడా అని హింట్ ఇస్తూనే ఉంటారు హీరోయిన్ సమంత. సింహం సింగిల్‌గా వుంది కదా అని జూలుతో జడెయ్యొద్దురోయ్ అనే వార్నింగులు కూడా వినిపిస్తాయి అప్పుడప్పుడూ. ఆ చందమామను చూడండి బుద్ధిగా కాపురం చేసుకుని ఓ బిడ్డకు తల్లయింది.. నువ్వూ ఉన్నావ్ ఎందుకు అంటూ గుచ్చిగుచ్చి అడుగుతున్న నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సామ్.

నా సహనాన్ని పరీక్షించకండి..నా మౌనాన్ని అంగీకారంగా తీసుకోకండి.. ఆ మౌనమే ఎప్పుడో ఒకసారి బద్దలౌతుంది.. అంటూ సోషల్ మీడియాలో ఆమె ఇచ్చిన వార్నింగ్‌.. ట్రోలర్ల పాలిట ఫిరంగిలా పేలింది. అదే సాయంత్రం.. సమంత నెక్ట్స్ మూవీ కేఆర్‌కే నుంచి ట్రయిలరొచ్చింది. అందులో సామ్‌ ఒరిజినల్‌ని చూసి మళ్లీ షాకయ్యారు ఫాలోయర్లు. కర్సివ్ డైలాగ్స్‌తో ఓవర్‌డోస్‌ కంటెంట్‌తో నటించడం సమంత చాలాకాలం కిందటే మొదలుపెట్టారు. సూపర్ డీలక్స్‌లో సామ్ చేసిన పాత్ర అప్పట్లోనే వాటీజ్‌ దిస్ బేబీ అనే క్వశ్చన్స్‌ని ఫేస్ చేసింది. తర్వాత ఫ్యామిలీ మెన్2లో రాజీ రోల్‌లో అబ్సీనిటీని కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు కేఆర్కేలో ఖతీజా పాత్రలో తన మార్కును మరోసారి చూపించేశారు. సో.. ఎవరు ఎన్ననుకున్నా.. నా రూటే సెపరేట్ అనేది యాపిల్ బ్యూటీ మేనరిజం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్‌..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu