సల్లూ భాయ్​ 31 ఇయర్స్ ఇండస్ట్రీ…ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

సల్లూ భాయ్​ 31 ఇయర్స్ ఇండస్ట్రీ...ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!
Salman Khan shares childhood photo with his fans on completing 31 years in Bollywood

బాలీవుడ్​లో సల్మాన్​ ఖాన్ స్థాయి వేరు, స్టామినా వేరు​. అలవోకగా 100 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. మాస్ పల్స్ బాగా తెల్సిన సల్మాన్ ఖాన్ ఆ దిశగానే తన బాడీ లాంగ్వేజ్‌ను, స్టైల్‌ను, ఫైట్స్‌ను, డ్యాన్స్‌ను డిజైన్ చేసుకుంటాడు. కాగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్​ చేశాడు ఈ ఎవర్‌గ్రీన్ బ్యాచిలర్ హీరో. ఈ ప్రయాణంలో తనను అభినందించిన వారందరికీ […]

Ram Naramaneni

|

Aug 29, 2019 | 6:17 AM

బాలీవుడ్​లో సల్మాన్​ ఖాన్ స్థాయి వేరు, స్టామినా వేరు​. అలవోకగా 100 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. మాస్ పల్స్ బాగా తెల్సిన సల్మాన్ ఖాన్ ఆ దిశగానే తన బాడీ లాంగ్వేజ్‌ను, స్టైల్‌ను, ఫైట్స్‌ను, డ్యాన్స్‌ను డిజైన్ చేసుకుంటాడు. కాగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్​ చేశాడు ఈ ఎవర్‌గ్రీన్ బ్యాచిలర్ హీరో. ఈ ప్రయాణంలో తనను అభినందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు​.

సల్మాన్​ మెుదటి చిత్రం ‘బీవీ హో తో హైసీ’ అయినప్పటికీ.. అతడికి గుర్తింపు తెచ్చింది మాత్రం 1989లో వచ్చిన ‘మైనే ప్యార్​ కియా’. ఈ సినిమాతోనే బాలీవుడ్​లో మంచి పేరు తెచ్చుకున్నాడు సల్మాన్​.’హమ్​ ఆప్​కే హై కౌన్​..!(1994), ‘కరణ్​ అర్జున్’​(1995),  ‘బీవీ నెం.1′(1999) చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత వరుస హిట్స్‌తో దూసుకుపోయాడు ఈ స్టార్ హీరో​. ఇటీవలే విడుదలైన ‘భారత్’​తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్​… ‘దబాంగ్​ 3’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu