Shruthi Haasan: శృతిహాసన్‏కు ఏమయ్యింది ?.. మారిపోయిన హీరోయిన్ ఫేస్.. ఫోటోస్ వైరల్..

బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న వీరసింహ రెడ్డి చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్న శ్రుతి.. తాజాగా అభిమానులకు షాకిచ్చింది.

Shruthi Haasan: శృతిహాసన్‏కు ఏమయ్యింది ?.. మారిపోయిన హీరోయిన్ ఫేస్.. ఫోటోస్ వైరల్..
Shruti Haasan
Follow us

|

Updated on: Nov 28, 2022 | 7:39 PM

టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. కమల్ హాసన్ నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ఇక కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి.. ఇటీవల క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. తిరిగి రావడంతోనే మరో బ్లా్క్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న వాల్తేరు వీరయ్య మూవీలో కనిపించనుంది. అంతేకాకుండా.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న వీరసింహ రెడ్డి చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్న శ్రుతి.. తాజాగా అభిమానులకు షాకిచ్చింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఫాలోవర్లకు టచ్ లో ఉండే శ్రుతి.. తాజాగా తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసి షాకిచ్చింది. ఆమె ఫీవర్, సైనస్ సమస్యలతో బాధపడుతుందట. బ్యాడ్ డే, బ్యాడ్ హెయిర్ తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు.. ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ కొన్ని ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఆమె ముఖం ఉబ్బిపోయి.. బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోస్ నెటింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆపోటోస్ చూసిన అభిమానులు.. శ్రుతికి ఏమైంది ? ఇలా తయారయ్యిందేంటీ ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శృతి రెండేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. ప్రస్తుతం అతనితో కలిసి ముంబైలో ఉంటోంది శృతి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.