Sai Pallavi: చైతూ పర్ఫార్మెన్స్ చూసి సాయి పల్లవి సీన్ రీ షూట్.. నాగచైతన్య పై న్యాచురల్ బ్యూటీ ప్రశంసలు..

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి అద్భుతమైన నటనతో వెండితెరపై మాయ చేస్తుంది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా సంప్రదాయంగా కనిపిస్తూ.. సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందుకే ఆమెకు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. గతేడాది అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు తండేల్ చిత్రంలో నటిస్తుంది.

Sai Pallavi: చైతూ పర్ఫార్మెన్స్ చూసి సాయి పల్లవి సీన్ రీ షూట్.. నాగచైతన్య పై న్యాచురల్ బ్యూటీ ప్రశంసలు..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 03, 2025 | 12:48 PM

గతేడాది అమరన్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సాయి పల్లవి నటిస్తోన్న లేటేస్ట్ మూవీ తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ఇక ఇందులోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. బుజ్జితల్లి, హైలెస్సో పాటలు వినిపిస్తున్నాయి. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత మరోసారి సాయి పల్లవి, నాగ చైతన్య జోడి నటిస్తుండడంతో ఈ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి చైతూ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించింది.

ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. “లవ్ స్టోరీ సినిమాలో చూసిన నాగ చైతన్యకు .. ఇప్పుడు తండేల్ సినిమాకు చూస్తున్న చైతూకు చాలా తేడా ఉంది. జైల్లో ఉన్న సీన్ ముందు షూట్ చేశారు. ఆ తర్వాత నా సీన్ షూట్ చేశారు. చైతూ యాక్టింగ్ చూసిన తర్వాత నేను దర్శకుడికి ఒక మాట చెప్పాను. మనకు ఉన్న స్క్రిప్ట్ కు.. తను చేసిన పెర్ఫార్మెన్స్ కు నేను చేసింది కొంచం తక్కువ అయిపోతుంది. కనుక నా సీన్ లో నా పెర్ఫార్మెన్స్ మరింత బాగా చేయాలి. లేదంటే చైతూ చేసిన ఆ సీన్ కు ఇది మ్యాచ్ కాదని చెప్పాను. ఎందుకంటే నాకు ఆ సీన్.. చైతూ యాక్టింగ్ చూశాకా అలా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి.

ఇవి కూడా చదవండి

దీంతో చైతూ యాక్టింగ్ పై మరింత హైప్ పెరిగింది. ఈ సినిమాలో చైతూ ఊరమాస్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే ఇది చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ చాలా నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సముద్రంలో సన్నివేశాలు, పాకిస్తాన్ సీక్వెన్స్, సెకండాఫ్ లో సాయిపల్లవి, చైతూ యాక్టింగ్ సినిమాకే హైలెట్ అవుతుందంటున్నారు మేకర్స్.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన