Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ సినిమా విడుదల వాయిదా పడనుందా..?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్'. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తేజ్ తొలిసారిగా నటిస్తున్న సినిమా ఇది.

  • Rajeev Rayala
  • Publish Date - 8:16 am, Thu, 22 April 21
Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ సినిమా విడుదల వాయిదా పడనుందా..?

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తేజ్ తొలిసారిగా నటిస్తున్న సినిమా ఇది. దేవకట్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. అంతేకాకుండా ఇందులో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. చాలా కాలం తర్వత ‘చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘చిత్రలహరి’ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజు పండగే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ‘సోలో బ్రతుకే సోబెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ఇది. ఈ సినిమా కూడా హిట్ టాక్ ను తెచుకోవడతో హ్యాట్రిక్ అందుకున్నాడు సాయి తేజ్. రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాను జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం విపరీతంగా ఉండటంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: భారీగా నమోదువ్వుతున్న కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మహేష్ బాబు

Shruti Haasan: ప్రభాస్ సలార్ సినిమాలో శృతిహాసన్ ఆ రోల్ లో కనిపించనుందట..!