Sai Dharam Tej: మరోసారి ఆ దర్శకుడితో సినిమా చేయనున్న మెగా మేనల్లుడు.. ఇంతకు ఆయన ఎవరంటే..

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవలే రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తెలియగానే మెగా అభిమానులంతా ఆందోళన చెందారు.

Sai Dharam Tej: మరోసారి ఆ దర్శకుడితో సినిమా చేయనున్న మెగా మేనల్లుడు.. ఇంతకు ఆయన ఎవరంటే..
Sai Tej
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 14, 2021 | 8:22 AM

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవలే రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తెలియగానే మెగా అభిమానులంతా ఆందోళన చెందారు. కొద్దీ రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై కెబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజుకు తీవ్ర గాయాలు కావడంతో.. సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లి హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవలే దీపావళి పండగ రోజున తేజ్ పూర్తిగా కోలుకున్నడంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు చిరు. ఇదిలా ఉంటే తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక ఇప్పుడు తేజ్ తన నెక్స్ట్ సినిమాల పై దృష్టి పెట్టాడు. అయితే  రిపబ్లిక్ సినిమా తర్వాత తేజ్ బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తేజ్ మరోసారి మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రతి రోజు పండగే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరై కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మారుతి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘యాక్సిడెంట్ నుంచి కోలుకున్న సాయి తేజ్ ని కలిశాను. ఆయన చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నారు. తేజ్ తో డెఫినెట్ గా మళ్ళీ సినిమా చేస్తాను. ఇప్పటికే ఓ లైన్ కూడా అనుకున్నాం..” అని డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!