భీమవరంలో” సాహో” ఫ్యాన్స్ రికార్డ్ బ్రేక్ చేసారుగా..!

భీమవరంలో సాహో ఫ్యాన్స్ రికార్డ్ బ్రేక్ చేసారుగా..!

ఎక్కడ చూసినా “సాహో” మ్యానియా హోరిత్తిస్తోంది. మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఊహకందని విధంగా తీసిన ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ గంటలు లెక్కపెట్టాల్సి వస్తోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ సొంతూరు భీమవరంలో ఆయన అభిమానుల సందడి మామూలుగా లేదు. అక్కడ ఏకంగా దసరా, దీపావళి , సంక్రాంతి, ఉగాది వంటి పండుగలన్నీ కలిసి ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో సాహో సందడి కూడా అలాగే […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 29, 2019 | 5:07 PM

ఎక్కడ చూసినా “సాహో” మ్యానియా హోరిత్తిస్తోంది. మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఊహకందని విధంగా తీసిన ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ గంటలు లెక్కపెట్టాల్సి వస్తోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ సొంతూరు భీమవరంలో ఆయన అభిమానుల సందడి మామూలుగా లేదు. అక్కడ ఏకంగా దసరా, దీపావళి , సంక్రాంతి, ఉగాది వంటి పండుగలన్నీ కలిసి ఒకేసారి వస్తే ఎలా ఉంటుందో సాహో సందడి కూడా అలాగే ఉంది. అంతగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. ముఖ్యంగా అక్కడ ఏకంగా రూ.1200 ఇచ్చి కొందామనుకున్నా టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.

ఇక ఫ్యాన్స్ సందడి చూస్తే మామూలుగా లేదు. భీమవరంలో ఎక్కడ చూసిన “సాహో” బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. భారీగా ఉన్న ప్రభాస్ సాహో ఫ్లెక్సీలతో పట్టణాన్ని నింపేశారు. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఇప్పటివరకు ఏ నటుడికీ ఏర్పాటు చేయనంత భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. దాదాపు 200 అడుగుల వెడెల్పుగల ఫ్లెక్సీని పెట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అభిమానుల సందడితో భీమవరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఓ రకంగా సాహో ఫీవర్‌తో యూత్ చేస్తున్న హడావిడీకి లిమిట్ లేకుండా పోయింది. రేపు రిలీజ్ కానున్న “సాహో” ఏకంగా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా ఊహించని విజయాన్ని అందుకోనుందని అభిమానులు చెబుతున్నారు. బాహుబలి రెండు పార్టులతో బాలీవుడ్‌లో తెలుగు సత్తా చాటిన ప్రభాస్.. “సాహో”తో మరోసారి దాన్ని కంటిన్యూ చేయనున్నాడని సినీవర్గాలు కూడా పేర్కొంటున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu