RRR Movie: ఆర్ఆర్ఆర్ మరో ఘనత.. 30 ఏళ్ల తర్వాత తెరుచుకున్న థియేటర్లలో రాజమౌళి సినిమా.. ఎక్కడంటే..

దాదాపు 30 ఏళ్ల తర్వాత తెరుచుకున్న థియేటర్లలో మొదటి సినిమాగా ఆర్ఆర్ఆర్‏ను ప్రదర్శించారు. ఇంతకీ ఎక్కడ అనేది తెలుసా. నిత్యం ఉగ్రవాదం పేరుతో ఎప్పుడూ ఘర్షణ వాతావరణం ఉండే

RRR Movie: ఆర్ఆర్ఆర్ మరో ఘనత.. 30 ఏళ్ల తర్వాత తెరుచుకున్న థియేటర్లలో రాజమౌళి సినిమా.. ఎక్కడంటే..
Rrr
Follow us

|

Updated on: Sep 21, 2022 | 7:36 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కాకుండా.. హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు.. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రపంచమే ఫిదా అయ్యింది. దాదాపు రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డుకెక్కింది. తాజాగా ఈ మూవీ మరో ఘనత సాధించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తెరుచుకున్న థియేటర్లలో మొదటి సినిమాగా ఆర్ఆర్ఆర్‏ను ప్రదర్శించారు. ఇంతకీ ఎక్కడ అనేది తెలుసా. నిత్యం ఉగ్రవాదం పేరుతో ఎప్పుడూ ఘర్షణ వాతావరణం ఉండే జమ్మూకశ్మీర్‏లో.

కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదంతో ఘర్షణ వాతావరణం ఉన్న కశ్మీర్ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తోంది. ఇక్కడ దాదాపు 30 ఏళ్ల క్రితం మూతపడిన థియేటర్లు మళ్లీ తెరుచుకున్నారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని పుల్వామమా శోపియాలలో మల్టీ పర్పస్ సినిమా హాళ్లను జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. అయితే మొదటిగా ఇక్కడి థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించారు. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని మనోజ్ సిన్హా సైతం కాసేపు వీక్షించారు. కశ్మీర్ లో 1980 లో థియేటర్లు ఉండేవి. కానీ ఆ సమయంలో ఉగ్రవాదులు థియేటర్లు ఓపెన్ చేస్తే చంపేస్తామని బెదిరించడంతో థియేటర్ల యజమానులు వాటిని మూసివేశారు. ఇక ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత థియేటర్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. దీంతో కశ్మీర్ ప్రజలకు మూడు దశాబ్ధాల తర్వాత వినోదం అందించింది అక్కడి ప్రభుత్వం.