అసభ్యంగా తడిమేది, సుశాంత్ సోద‌రిపై రియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం విష‌యంలో తీవ్ర‌ ఆరోపణలను ఎదుర్కొంటున్న అత‌డి గ‌ర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి మంగళవారం సుశాంత్ ఫ్యామిలీపై‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

  • Ram Naramaneni
  • Publish Date - 11:17 am, Wed, 19 August 20
అసభ్యంగా తడిమేది, సుశాంత్ సోద‌రిపై రియా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం విష‌యంలో తీవ్ర‌ ఆరోపణలను ఎదుర్కొంటున్న అత‌డి గ‌ర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి మంగళవారం సుశాంత్ ఫ్యామిలీపై‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఆమె త‌రుపు లాయ‌ర్ల‌ ఓ సుదీర్ఘ ప్రకటన రిలీజ్ చేశారు. మహారాష్ట్ర గృహిణికి, ఇండియ‌న్ ఆర్మీలో సర్జన్‌గా పనిచేసిన వ్యక్తికి జన్మించిన కుమార్తెగా తనను తాను పేర్కొన్న రియా.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా బేస్‌లెస్ అని కొట్టిపారేశారు.

ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలకు తాను పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పారు. 2019 ఏప్రిల్‌లో సుశాంత్‌ కుటుంబ సభ్యుల్లోని బ్యాడ్ క్వాలిటీస్ గుర్తించినట్లు తెలిపారు. ఒకరోజు రాత్రి తాను సుశాంత్‌ ప్లాట్‌లో ఉన్న సమయంలో అత‌డి సోదరి ఫుల్‌గా మ‌ద్యం సేవించి తన బెడ్‌రూమ్‌లోకి వచ్చిందని, అనంతరం అసభ్యంగా తడిమిందని రియా ఆరోపించారు.

”రియా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అనంతరం సుశాంత్‌ సోదరిని గది నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత రియా కూడా ఆ ఇంటి నుంచి వచ్చేశారు. అనంతరం ఈ విష‌యాన్ని రియా సుశాంత్‌కు చెప్పింది. దీంతో సుశాంత్‌ సోదరితో గొడవ ప‌డ్డాడు. ఈ ఘటనతో సుశాంత్ ఫ్యామిలీకి, రియాకు మధ్య విభేదాలు స్టార్ట‌య్యాయి” అని మంగళవారం విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌లో రియా పేర్కొనారు.

 

Also Read:

ఇసుక విధానంలో మార్పులు, మ‌రోసారి జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు 

వారికి త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేలు : ఏపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు