ఈ సారి వ‌ర్మ‌ టార్గెట్ ​అర్నబ్​ గోస్వామి

చలికాలం, వానాకాలం, ఎండా కాలం, క‌రోనా కాలం..ఇలా సీజ‌న్ ఏదైనా వ‌ర్మ వివాదాల‌కు కాదు ఆట‌కం. ఆయ‌న‌ ఓ వివాదం నుంచి బ‌య‌ట ప‌డ‌కుండానే..మ‌రో అగ్గి రాజేస్తారు.

ఈ సారి వ‌ర్మ‌ టార్గెట్ ​అర్నబ్​ గోస్వామి

RGV Next Movie : చలికాలం, వానాకాలం, ఎండా కాలం, క‌రోనా కాలం..ఇలా సీజ‌న్ ఏదైనా వ‌ర్మ వివాదాల‌కు కాదు ఆట‌కం. ఆయ‌న‌ ఓ వివాదం నుంచి బ‌య‌ట ప‌డ‌కుండానే..మ‌రో అగ్గి రాజేస్తారు. దీంతో పాత టాపిక్ సైడైపోయి..ఫ్రెష్ థీమ్ వెలుగులోకి వ‌స్తుంది. స‌మాజంలో మెజార్టీ పార్ట్ దాని గురించే చ‌ర్చిస్తుంది. ఆయ‌న్ను‌ ప్ర‌శంసించేవారు, విమ‌ర్శించేవారు రెండు వ‌ర్గాలుగా విడిపోయి సోష‌ల్ మీడియాలో యుద్దం చేస్తారు. కొన్నిసార్లు భౌతిక దాడులు కూడా జ‌రిగిన సంద‌ర్భాలున్నాయి. అయినా వ‌ర్మ వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. చాలా లైట్ తీస్కోని తాను నెక్ట్స్ ఏ వివాద‌స్ప‌ద విష‌యాన్ని సినిమాగా తీయాలా అని ఆలోచిస్తుంటారు.

తాజాగా బయోపిక్​లు, య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌పై సినిమా తీస్తోన్న వ‌ర్మ‌.. ఇటీవలే ‘పవర్​స్టార్’​ సినిమాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అభిమానుల ఆగ్ర‌హాన్ని చ‌విచూశాడు. ఈ లాక్​డౌన్​ సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ..సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయ్యాడు. తాజాగా మరో సంచలన చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ప్రముఖ జర్నలిస్ట్​ అర్నబ్​ గోస్వామిపై మూవీ తీస్తానని ట్వీట్​ చేశాడు. దీనికి ‘అర్నబ్.. ద న్యూస్​ ప్రాస్టిట్యూట్​’​ అనే టైటిల్​ పెట్టనున్నట్లు వెల్ల‌డించాడు.

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ సూసైడ్ కేసుపై.. తనదైన శైలిలో చ‌ర్చ‌లు పెట్టి ఇండస్ట్రీలో మాఫియా ప్రభావంపై విరుచుకుపడ్డాడు అర్నబ్​. ఈ క్రమంలోనే ఆర్జీవీ స్పందిస్తూ.. చిత్రసీమ గురించి అర్నబ్​ గోస్వామి చేసిన వ్యాఖ్య‌లు తనను చాలా ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నాడు. ఇలా అనేక విశ్లేషణలతో వరుస ట్వీట్లు చేసి నెటిజ‌న్లను ఆక‌ర్షించాడు వర్మ.

 

Read More : మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌ల‌కు అమృత ప్ర‌ణ‌య్ నోటీసులు

Click on your DTH Provider to Add TV9 Telugu