Prabhas : “సలార్” కంటే ముందే నాగ్ అశ్విన్ సినిమా రానుందా..? “ప్రాజెక్ట్ కే” మొదలయ్యేది అప్పుడే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్

Prabhas : సలార్ కంటే ముందే నాగ్ అశ్విన్ సినిమా రానుందా..? ప్రాజెక్ట్ కే మొదలయ్యేది అప్పుడే..
Prabhas
Follow us

|

Updated on: Nov 26, 2021 | 4:53 PM

Prabhas :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈసినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సలార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో పొడుగు కాళ్ళ సుందరి శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేశారు ప్రభాస్.  ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. ఇవే కాకుండా.. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా చేయనున్నాడు. అయితే వీటిలో సలార్ సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. సలార్  సినిమా కంటే ముందే ప్రాజెక్ట్ కే వస్తుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ పూర్తి చేశాడు. అమితాబచ్చన్ పై ఆ షెడ్యూల్ ను తెరకెక్కించారు. డిసెంబర్ 2 నుండి ప్రభాస్ అలాగే కీలక నటీ నటులు కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ డిసెంబర్ 2న ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మళ్లీ సలార్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏంజరుగుతుందో

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)

Nivetha Pethuraj: న్యూ ఫోటోస్ తో ఆకట్టుకుంటున్న నివేత పేతురాజ్.. వరుస సినిమాలతో బిజీగా ముద్దుగుమ్మ..