Dhanush – Aishwarya: నీ సుఖమే నే కోరుకున్నా.. ధనష్ – ఐశ్వర్య బ్రేకప్‌కి అదే కారణమా..?

Dhanush - Aishwarya: నీ సుఖమే నే కోరుకున్నా.. ధనష్ - ఐశ్వర్య బ్రేకప్‌కి అదే కారణమా..?
Dhanush And Aishwarya

సెలబ్రిటీ జంట ధనుష్-ఐశ్వర్య బ్రేకప్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌కు మారింది. ఇద్దరు విడిపోవాలని తీసుకున్న నిర్ణయానికి కారణం ఏమై ఉండొచ్చు? ఈ అంశం మీద సినీ వర్గాలతో పాటు అటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. 

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Jan 18, 2022 | 5:22 PM

సెలబ్రిటీ జంట ధనుష్-ఐశ్వర్య(Dhanush – Aishwarya) బ్రేకప్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌కు మారింది. ఇద్దరు విడిపోవాలని తీసుకున్న నిర్ణయానికి కారణం ఏమై ఉండొచ్చు? ఈ అంశం మీద సినీ వర్గాలతో పాటు అటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది. ధనుష్-ఐశ్వర్య మధ్య అనుమానాల్లేవ్‌.. కొట్లాటల్లేవు.. చిచ్చుపెట్టే రిలేషన్‌షిప్స్‌ లేవు. అయినా ఇద్దరి మధ్యా అగాధం రోజురోజుకూ పెరుగుతూపోయింది. పెద్దవాళ్లు జోక్యం చేసుకున్నా పూడ్చలేనంత. ప్యాచప్‌ ప్రయత్నాలు చేసినా మళ్లీ కలపలేనంత. ధనుష్‌-ఐశ్వర్యల బ్రేకప్‌ వెనుక ఎవరికీ అర్ధంకానంత, ఓ పట్టాన అర్ధంచేసుకోలేనంత బలమైన కారణం. దంపతులుగా ఉన్నా కొన్నేళ్లుగా ఇద్దరి మధ్యా ఎడబాటు పెరుగుతూ వచ్చింది. సెలబ్రిటీల జీవితంలో సగటుమనిషికి ఉండే సంతోషం కూడా కరువేనన్న విషయం ఈ సెన్సేషనల్‌ బ్రేకప్‌తో ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చింది.

ధనుష్‌. మామగారిలాగే టాలెంట్‌ని నమ్ముకుని ఎదిగిన యువహీరో. సిక్స్‌ప్యాక్‌లూ, సింహగర్జనలేమీ లేకుండా జస్ట్‌ సింపుల్‌గా ఇంటి పక్క కుర్రాడిలా ముద్ర వేసే కటౌట్‌. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కూతురితో ప్రేమలో పడ్డప్పుడు ఎవరీ పిలగాడని అంతా ఆశ్చర్యపోయి చూశారు. ఏముందని తలైవా ఇతన్ని అంగీకరించాడని చెవులు కొరుక్కున్నారు. అంతనికి ఏముందో ప్రేమించిన ఐశ్వర్యకి తెలుసు. అతని మంచితనానికి మనసిచ్చేసింది. రెండేళ్ల వయసు తేడా వారి పరిణయకావ్యానికి అడ్డుతెర కాలేకపోయింది. మామ పెద్దరికానికి మచ్చతెచ్చేలా ఎప్పుడూ మసలుకోలేదు ధనుష్‌ కూడా. రజినీకాంత్‌ అల్లుడిగా కాకుండా టాలెంట్‌ ఉన్న నటుడిగానే ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చాడు. కోలీవుడ్‌, టాలీవుడ్‌, చివరికి బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సృష్టించుకున్నాడు.

Dhanush Aishwaryaa

Dhanush Aishwaryaa

18ఏళ్ల దాంపత్యజీవితం..ఇద్దరు సంతానం. ఇన్నేళ్ల జీవన ప్రయాణం తర్వాత ధనుష్‌-ఐశ్వర్యల బంధం తెగిపోయింది. ధనుష్‌ నటుడిగా బిజీ అవుతున్నాడు. ఓ ప్రాజెక్ట్‌ కాగానే తర్వాతి ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నాడు. షూటింగ్‌లకోసం ఎక్కడెక్కడో తిరుగుతూ క్షణం తీరికలేనంత బిజీ అయిపోయాడు. ఎంత బిజీ అంటే భార్యాపిల్లలతో గడిపేంత టైం కూడా దొరకనంత. ఇక సూపర్‌స్టార్‌ కూతురిగా, క్రేజీ హీరో భార్యగా ఉన్నా ఐశ్వర్యకి జీవితంలో తానేదో కోల్పోతున్నామన్న భావన పెరుగుతూపోయింది. తన ఆలోచనలకు, భర్త ప్లానింగ్‌కి కొన్నాళ్లుగా సింక్‌ కావడం లేదు. పేరుకే భార్యభర్తలమన్న ఫీలింగ్‌. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నామా? ఏ లోటూ లేకపోయినా ఓ పూట కలిసి గడపగలుగుతున్నామా? ఇదేనా జీవితం? ఇదేం జీవితం? సమాజంకోసమో, సినిమా జనంకోసమో భార్యభర్తల ట్యాగ్‌ మెళ్లో వేసుకునే ఉండాలా? పరిష్కారం ఏదన్నా దొరుకుతుందేమోనని ఇద్దరూ మాట్లాడుకున్నారు. కానీ ఎంత ముందుకెళ్లినా పట్టాలు ఎప్పటికీ కలవవని అర్ధమైపోయింది.

ద్వేషించుకోవడం, ఒకర్నొకరు నిందించుకోవడంలో అర్ధంలేదు. ఎవరి ఆలోచనలు వాళ్లవి. ఎవరి జీవితం వారిది. వివాహబంధనాలను విప్పేస్తే ఎవరి ప్రపంచంలో వారు స్వేచ్ఛా విహంగాల్లా బతకొచ్చు. అందుకే మూడుముళ్లు విప్పేశారు. మనసులోని మాట చెప్పేశారు. కలిసి బతకాలనుకున్నది వాళ్లు. కలిసి బతకడం ఇక కష్టమనుకున్నదీ వాళ్లే. మనసొక అద్దం. పగిలితే అతకదన్నది నిష్టురసత్యం. కలిసుండి కుమిలిపోయేకంటే విడిపోయి సుఖంగా బతకడమే మంచిదని ఈ యువజంట సందేశం.

-ఎస్ఐ షఫీ, టీవీ9 తెలుగు

Also Read..

TELANGANA BJP: తెలంగాణలో బీజేపీ దూకుడుకు కారణం అదే.. ! ఆపరేషన్ ఆకర్ష్.. ఆందోళన కార్యక్రమాల వెనుక వ్యూహమిదే..!!

Aishwaryaa Dhanush: ర‌జినీ కంటే ఐశ్వ‌ర్య 100 రెట్లు సింపుల్‌గా ఉంటుంది.. ఐశ్వ‌ర్య‌పై ధ‌నుష్ చేసిన వ్యాఖ్య‌లివీ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu