Raviteja: రావణాసుర రెగ్యూలర్ షూటింగ్ షూరు చేసిన మాస్ మాహారాజా..

మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రావణాసుర. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం

Raviteja: రావణాసుర రెగ్యూలర్ షూటింగ్ షూరు చేసిన మాస్ మాహారాజా..
Raviteja
Follow us

|

Updated on: Jan 19, 2022 | 7:35 AM

మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రావణాసుర. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి రోజున మెగాస్టార్ చిరంజీవి, ఇతర అతిథుల‌ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న రావణాసుర రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించింది చిత్రయూనిట్. ప్రస్తుతం కీల‌క తారాగ‌ణంపై నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ ఐదు పాత్రల‌కు కూడా మంచి ప్రాముఖ్యత ఉండ‌నుంది. రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ ఖిలాడి, రామరావు ఆన్ డ్యూటీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Also Read: Anasuya Bharadwaj : నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనసూయ.. ఇంతకు అతడు ఏమడిగాడంటే..

Bangarraju: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు.. బంగార్రాజు స‌క్సెస్ మీట్‌లో నాగార్జున ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..

Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..