Ravi Teja’s Khiladi : మాస్ రాజా సినిమా పై మరింత క్లారిటీ.. అనుకున్న సమయానికి ఖిలాడి ల్యాండింగ్..

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రాక్ సినిమా తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Ravi Teja's Khiladi : మాస్ రాజా సినిమా పై మరింత క్లారిటీ.. అనుకున్న సమయానికి ఖిలాడి ల్యాండింగ్..
Raviteja
Follow us

|

Updated on: Jan 15, 2022 | 5:53 PM

Ravi Teja’s Khiladi : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రాక్ సినిమా తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పాటలు, అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ నటిస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా.. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. చివరకుసినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు. అయితే ఈ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ.. వార్తలు చక్కర్లు కొట్టాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్ని సమ్మర్ కు షిఫ్ట్ అయ్యాయి. దాంతో రవితేజ సినిమాకూడా ఫిబ్రవరికి రాకపోవచ్చని గుసగుసలు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టారు మేకర్స్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 11నే విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్.. సచిన్ ఖేడ్కర్ .. ముఖేశ్ రుషి కనిపించనున్నారు. అలాగే  రావు రమేశ్ .. ఉన్ని ముకుందన్.. మురళీ శర్మ.. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఈ సినిమాతోపాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు మాస్ రాజా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

Bangarraju: నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా పై కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. అన్నయ్య అంటూ..

Swathi Muthyam Glimpse: బెల్లంకొండ చిన్నబాబు సంక్రాంతి ట్రీట్.. స్వాతి ముత్యం నుంచి ఫస్ట్ గ్లిమ్స్..