ఆ పండగలను టార్గెట్ చేసిన మాస్ రాజా.. టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యేది అప్పుడేనా..

మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక త్వరలో రవితేజ మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..

ఆ పండగలను టార్గెట్ చేసిన మాస్ రాజా.. టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యేది అప్పుడేనా..
Raviteja
Follow us

|

Updated on: Jan 29, 2023 | 7:36 AM

మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా రెండు సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే ధమాకా సినిమా మంచి హిట్ గా నిలవగా.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక త్వరలో రవితేజ మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. వాటిలో ఒకటే టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు`. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది.

గత ఏడాది ఉగాది రోజున (ఏప్రిల్ 2న)  టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ ను జరిగింది.  పాన్ ఇండియా చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`తో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్.

ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. దీపావళి లేదా క్రిస్మస్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. మొన్నామధ్య రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. 1970 నాటి కథ కావడంతో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?