Ravi Teja: రెమ్యునరేషన్ రూమర్స్ పై స్పందించిన మాస్ రాజా.. ఏమన్నాడంటే..

Ravi Teja: రెమ్యునరేషన్ రూమర్స్ పై స్పందించిన మాస్ రాజా.. ఏమన్నాడంటే..
Raviteja

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. చాలా కాలంగా హిట్ లేక సతమతం అయిన రవితేజ ఎట్టకేలకు క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు

Rajeev Rayala

|

Jan 02, 2022 | 12:28 PM

Ravi Teja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. చాలా కాలంగా హిట్ లేక సతమతం అయిన రవితేజ ఎట్టకేలకు క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ తో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. ఈ క్రమంలోనే ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది . త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ షూటింగ్ లలో బిజీ కానున్నాడు.

ఇదిలా ఉంటే రవితేజ రెమ్యునరేషన్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. అతడు వరుస ఫ్లాపుల్లో ఉన్నా కానీ 10కోట్ల పారితోషికం ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నాడని.. ఎక్కడా తగ్గకపోవడంతో నిర్మాతలు సీరియస్ గా ఉన్నారని కూడా టాక్ వినిపించింది. దీనిపై బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో క్లారిటీ ఇచ్చాడు మాస్ రాజా. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్   రవితేజ మాట్లాడుతూ-“లాస్ట్ మూవ్ మెంట్ లో సినిమా ఫ్లాపైంది అనుకోండి .. నేను తిరిగిచ్చేసేవాడిని.. చెక్ చింపేసి ఇచ్చేసేవాడిని..“ అని రవితేజ అన్నారు. ఇప్పుడు ఈవీడియో చెక్కర్లు కొడుతుంది. ఇక ఈ టాక్ షోలో రవితేజ- గోపిచంద్ మలినేనితో కలిసి బాలయ్య సందడి చేశారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ అవ్వనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu