Ravi Teja : కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చాలా కూల్ గా ఫోజిచ్చిన మాస్ రాజా.. ఖిలాడి నుంచి రవితేజ స్పెషల్ పోస్టర్

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఖిలాడి  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. గత ఏడాది క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రవితేజ ఈ ఏడాది..

Ravi Teja : కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చాలా కూల్ గా ఫోజిచ్చిన మాస్ రాజా.. ఖిలాడి నుంచి రవితేజ స్పెషల్ పోస్టర్
Raviteja
Follow us

|

Updated on: Feb 11, 2022 | 10:28 AM

Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఖిలాడి  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. గత ఏడాది క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రవితేజ ఈ ఏడాది ఖిలాడి గా అలరించడానికి రెడీ అవుతున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పాటలు, అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ నటిస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా.. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. చివరకుసినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు.

తాజాగా నేడు రవితేజ పుట్టిన రోజు కావడంతో ఆయన కు విషెస్ చెప్తూ.. ఖిలాడి చిత్రయూనిట్ ఓ మాస్ మసాలా సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు.ఈ మేరకు రవితేజకు విషెస్ చెప్తూ అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రవితేజ కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ముందుగా ఈ పాటను ఉదయం 10 గంటల సమయంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆతర్వాత టైం ను చేంజ్ఈ చేసి సాయంత్రం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 4.05 నిమిషాలకు పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

Padma Awards 2022: పద్మ అవార్డులకు ఎంపికైన వారిపై మెగాస్టార్‌ చిరంజీవి ఏమన్నారంటే..!

Dilraju: ఆ సమయంలో డిప్రెషన్‏లో వెళ్లాను.. సినిమాలే నిలబెట్టాయి.. నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్..