Rashmika Mandanna : మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్న నేషనల్ క్రష్.. ఆ మూవీలో రష్మిక ఇలా..

వరుస విజయాలతో టాలీవుడ్ లో లక్కీ లేడీగా మారిపోయింది అందాల భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైనా రష్మిక.

Rashmika Mandanna : మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్న నేషనల్ క్రష్.. ఆ మూవీలో రష్మిక ఇలా..
దాంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఇక రష్మిక కేవలం తెలుగులోనే కాకుండా .. తమిళ్ , కన్నడ , హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.
Follow us

|

Updated on: Jan 10, 2022 | 2:52 PM

Rashmika Mandanna : వరుస విజయాలతో టాలీవుడ్ లో లక్కీ లేడీగా మారిపోయింది అందాల భామ రష్మిక మందన్న. ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైనా రష్మిక. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఈ చిన్నది ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడి కెరీక్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా అనే చెప్పాలి. అప్పటివరకు మీడియం రేంజ్ హీరోల సరసన నటించిన రష్మిక.. అనీల్ రావిపూడి పుణ్యమా అంటూ ఏకంగా మహేష్ బాబు పక్కన నటించే అవకాశాన్ని అందుకుంది.

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. ఇక రీసెంట్ గా సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాలో నటించింది రష్మిక.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పుష్ప సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో ఆకట్టుకుంది రష్మిక. ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ అమ్మడు తెలుగు, తమిళ్ తోపాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. తెలుగు ప్రస్తుత, పుష్ప, శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలతోపాటు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు కూడా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక సినిమా చేస్తుంది. . గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మరోసారి గ్రామీణ యువతి పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ఓ కిరానా కొట్టు యజమాని కూతురిగా రష్మిక కనిపించనుందట. కిరాణా కొట్టు నడిపే వ్యక్తి కూతురు బిజినెస్ విమెన్ గా ఏస్థాయికి ఎదిగింది అనేది ప్రధాన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: సామ్ స్పెషల్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసిన ఆషూ రెడ్డి.. నెట్టింట్లో ఫుల్ వెర్షన్ వీడియో ..

Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్

Harish Shankar: నెటిజన్ పై డైరెక్టర్ హరీశ్ శంకర్ సీరియస్.. ఎందుకంటే..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.