‘రమణ..లోడ్ ఎత్తాలిరా’ డైలాగ్‌కు ‘జబర్దస్త్‌’ టచ్…

“రమణ లోడ్ ఎత్తాలిరా..చెక్‌పోస్ట్ పడతాది” ఈ డైలాగ్ ఇటీవలి కాలంలో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో దర్శకుడు అనిల్ రావిపూడి… హీరో మహేశ్‌బాబు, నటుడు కుమనన్ సేతురామన్ మధ్య జరిగే సంభాషణగా ఈ ట్రాక్ రాశాడు. ఒకే ఒక్క డైలాగ్ అతని లైఫ్‌ని మార్చేసింది. తమిళనాడుకు చెందిన సేతురామన్ సినిమాలు పిచ్చితో..30 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎన్నో సినిమాల్లో చిన్న, చిన్న పాత్రలు పోషించాడు. […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:11 pm, Sat, 7 March 20
'రమణ..లోడ్ ఎత్తాలిరా' డైలాగ్‌కు 'జబర్దస్త్‌' టచ్...

“రమణ లోడ్ ఎత్తాలిరా..చెక్‌పోస్ట్ పడతాది” ఈ డైలాగ్ ఇటీవలి కాలంలో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో దర్శకుడు అనిల్ రావిపూడి… హీరో మహేశ్‌బాబు, నటుడు కుమనన్ సేతురామన్ మధ్య జరిగే సంభాషణగా ఈ ట్రాక్ రాశాడు. ఒకే ఒక్క డైలాగ్ అతని లైఫ్‌ని మార్చేసింది. తమిళనాడుకు చెందిన సేతురామన్ సినిమాలు పిచ్చితో..30 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎన్నో సినిమాల్లో చిన్న, చిన్న పాత్రలు పోషించాడు. మెగాస్టార్ ‘సైరా’లో నిహారిక తండ్రిగా నటించింది, అల్లుడు శ్రీనులో బాబాగా కనిపించింది కూడా ఈయనే. కానీ అవన్నీ వచ్చివెళ్లేవి తప్ప.. గుర్తుంచుకునేవి కాదు. కానీ లోడ్ ఎత్తాలిరా డైలాగ్ అతనికి స్టార్ స్టేటస్ తెచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఎంత ఫేమ్ వచ్చింది అంటే… ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోలో ఆయన గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చే రేంజ్‌కి వెళ్లిపోయాడు. తాజా ప్రోమోలో సేతురామవ్..’మాస్ అవినాస్, కెవ్వు కార్తీక్’ టీమ్‌ స్కిట్‌లో గెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. లోడ్ ఎత్తాలిరా అనే అతడి డైలాగ్‌కు…లేడీ గెటప్పుల్లో కార్తీక్, అవినాశ్ ఇచ్చిన పంచ్‌లు జబర్దస్త్‌గా పేలాయి. ఏది ఏమైనా అతడి 30 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం లభించనట్టుగానే అనిపిస్తుంది. ఈ మధ్య ఈ నటుడికి పలు మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నట్టు సమాచారం. జబర్దస్త్ కమెడియన్లు కూడా ఇటువంటి నటులను ప్రొత్సహించడం మంచి పరిణామంగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.