Ram Charan: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత వారం రోజులు బయటకు రాని రామ్ చరణ్.. ఎందుకంటే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తన విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తాడు.. అలాగే తన తండ్రి చిరంజీవి వారసత్వాన్ని కొనసాగించే ఒత్తిడిని ఎలా జయిస్తాడో చెప్పుకొచ్చాడు. అలాగే ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత ఒక వారం రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదని అన్నారు. కెరీర్ విషయానికి వస్తే ఎలాంటి ఒత్తిడికి లోను కానని అన్నారు.

Ram Charan: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత వారం రోజులు బయటకు రాని రామ్ చరణ్.. ఎందుకంటే..
Ram Charan
Follow us

|

Updated on: Jun 18, 2024 | 1:30 PM

గ్లోబల్ స్టా్ర్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తన విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తాడు.. అలాగే తన తండ్రి చిరంజీవి వారసత్వాన్ని కొనసాగించే ఒత్తిడిని ఎలా జయిస్తాడో చెప్పుకొచ్చాడు. అలాగే ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత ఒక వారం రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదని అన్నారు. కెరీర్ విషయానికి వస్తే ఎలాంటి ఒత్తిడికి లోను కానని అన్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ.. “నాకు ఒత్తిడిని ఎలా తీసుకోవాలి అనే విషయం తెలియదు. నిజానికి సినిమా బాగా ఆడినప్పుడు నేను పార్టీ చేసుకుంటాను. కానీ ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయ్యాక మాత్రం ఒక వారం రోజులు నేను ఇంటి నుంచి బయటకు రాలేదు. ఆ సమయంలో నేను పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను. అలాగే నా కుటంబంతో కలిసి పూర్తిగా సమయాన్ని ఆస్వాదించాను. అన్ని సినిమా విజయాల కంటే ఆర్ఆర్ఆర్ నాకు ప్రత్యేకంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి కుమారుడిగా.. తండ్రి వారసత్వాన్ని కొనసాగించే విషయంలో ఒత్తిడికి గురవుతున్నారా..? అని అడగ్గా.. దాని గురించి ఎలాంటి ఆలోచన లేదని.. కేవలం తన సినిమాలపై మాత్రమే ఫోకస్ చేసినట్లు తెలిపారు. “ప్రతి రోజు ఏం చేస్తున్నాము.. అదే ముఖ్యమని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషించగా.. శ్రియా, అజయ్ దేవగణ్, అలియా భట్ కీలకపాత్రలు పోషించారు. 2022లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా.. ఇందులో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!