డ్యూయల్ రోల్ లో కనిపించనున్న రామ్ చరణ్.. ఆ సినిమాలో తండ్రీకొడుకులుగా మెగా పవర్ స్టార్..

మెగాపవర్ స్థార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో

  • Rajeev Rayala
  • Publish Date - 8:00 am, Thu, 22 April 21
డ్యూయల్ రోల్ లో కనిపించనున్న రామ్ చరణ్.. ఆ సినిమాలో తండ్రీకొడుకులుగా మెగా పవర్ స్టార్..
Ram Charan Acharya Movie

ram charan shankar movie: మెగాపవర్ స్థార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమాలో చిరంజీవి, చరణ్ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు.

శంకర్, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇది 50వ సినిమా అలాగే చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్ రాజు- శిరీష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుందంటూ వార్తలు కూడా వచ్చాయి.ఇక ఇందులో తండ్రీకొడుకుల పాత్రలు వున్నాయట. ఈ రెండు పాత్రలూ పవర్ ఫుల్ పాత్రలు కావడంతో తాను ద్విపాత్రాభినయం చేస్తానంటూ చరణ్ దర్శకుడి ముందు ఓ ప్రపోజల్ పెట్టినట్టు చెబుతున్నారు. అయితే, ముందుగా తండ్రి పాత్రలో చరణ్ కి లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఏ విషయం ఫైనల్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: భారీగా నమోదువ్వుతున్న కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మహేష్ బాబు

Shruti Haasan: ప్రభాస్ సలార్ సినిమాలో శృతిహాసన్ ఆ రోల్ లో కనిపించనుందట..!