Allu Arjun: నేను ఆ భాషలో సినిమా చేయను.. తేల్చి చెప్పేసిన అల్లు అర్జున్
పుష్ప 2కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2022లో విడుదలైన పుష్ప పార్ట్ 1 విజయం సాధించడంతో, ఇప్పుడు పుష్ప ది రూల్ అనే రెండవ భాగాన్ని చాలా మంది అభిమానుల అంచనాలను అందుకునే విధంగా రూపొందించారు సుకుమార్.
ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పుష్ప 2కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2022లో విడుదలైన పుష్ప పార్ట్ 1 విజయం సాధించడంతో, ఇప్పుడు పుష్ప ది రూల్ అనే రెండవ భాగాన్ని చాలా మంది అభిమానుల అంచనాలను అందుకునే విధంగా రూపొందించారు సుకుమార్. అల్లు అర్జున్ తోపాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, ధనంజయ, రావు రమేష్, సునీల్ వంటి ప్రముఖులు కూడా నటిస్తున్నారు. పుష్ప 2 సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా మొదటి భాగానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, పుష్ప ది రూల్ చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించారు.
అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..
ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమై ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రీసెంట్ గా ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రమోషన్ ఫంక్షన్‌లో నటుడు అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్ చాలా చోట్ల జరుగుతోంది. కాగా రీసెంట్ గా ముంబైలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ తర్వాత అల్లు అర్జున్ మీడియాను కలిశారు. మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు.
ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ చిన్నది
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేను ఒకసారి దేవి శ్రీ ప్రసాద్‌ని హిందీ చిత్రాలకు నువ్వు సంగీతం ఎందుకు అందించడం లేదు అని అడిగాను, దానికి దేవీ “నువ్వు హిందీ చిత్రాలలో ఎందుకు నటించకూడదు.?” నువ్వు హిందీ సినిమాల్లో నటిస్తే నేనూ నీతో కలిసి హిందీ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తానని చెప్పాడు. కానీ నేను హిందీ సినిమాల్లో నటించను అని అన్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం చాలా కష్టం అని అల్లు అర్జున్ ఓపెన్‌గా చెప్పారు. ఇప్పుడు ఈ కామెట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..