పవన్ మళ్లీ మేకప్ వేసుకునేది ఆ రోజే..!

ఫిల్మ్ కెరీర్ మంచి పీక్ దశలో ఉండగా బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కాస్తా జనసేనానిగా మారిపోయాడు. అజ్ఞాతవాసి ఆయన నటించిన ఆఖరి సినిమా. కాగా పవన్ ప్రస్తుతం పాలిటిక్స్‌లో యమ బిజీగా ఉన్నాడు. ఏపీలో బీజేపీతో దోస్తీ కట్టి ప్రయాణం షురూ చేశాడు. మరోవైపు ఎన్నికలు చాలా దూరం ఉన్న నేపథ్యంలో ఫిల్మ్ రీ ఎంట్రీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్. సూపర్‌హిట్ బాలీవుడ్ మూవీ […]

పవన్ మళ్లీ మేకప్ వేసుకునేది ఆ రోజే..!
Follow us

|

Updated on: Jan 17, 2020 | 6:01 PM

ఫిల్మ్ కెరీర్ మంచి పీక్ దశలో ఉండగా బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కాస్తా జనసేనానిగా మారిపోయాడు. అజ్ఞాతవాసి ఆయన నటించిన ఆఖరి సినిమా. కాగా పవన్ ప్రస్తుతం పాలిటిక్స్‌లో యమ బిజీగా ఉన్నాడు. ఏపీలో బీజేపీతో దోస్తీ కట్టి ప్రయాణం షురూ చేశాడు. మరోవైపు ఎన్నికలు చాలా దూరం ఉన్న నేపథ్యంలో ఫిల్మ్ రీ ఎంట్రీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్. సూపర్‌హిట్ బాలీవుడ్ మూవీ ‘పింక్‌’ రీమేక్‌తో పవన్‌ రీ ఎంట్రీ ఖరారైంది. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

కాగా మూవీకి సంబంధించిన ఆసక్తికర అబ్డేట్స్ ఫిల్మ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 20 వ తేదీ నుంచి ‘పింక్’ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు పవన్‌పై ఓ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ షూట్ చేయనున్నారట. మరోవైపు సినిమా కోసం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో భారీ కోర్టు సెట్ వేస్తోన్నారు. మేజర్ షూటింగ్ పార్ట్ అంతా ఆ సెట్‌లోనే జరగనుంది. మూవీ కోసం పవన్ 20 రోజుల మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు సినిమా రిలీజ్ డేట్‌ కూడా మూవీ టీం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సమ్మర్ గిప్ట్‌గా మే 23న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు ఫిలిం వర్గాల్లో చర్చ సాగుతోంది.