MAA Elections 2021: ‘మా లొల్లి’.. ఇపట్లో ఆగేనా..? రాజీనామాల పర్వం కొనసాగేనా..?

మాలో ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయ్. యుద్ధం ముగిసినా వేడి చల్లారడం లేదు. మాలో ఇప్పుడు రాజీనామాల పర్వం నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు రిజైన్లతో సెగలు రేపుతున్నారు.

MAA Elections 2021: 'మా లొల్లి'.. ఇపట్లో ఆగేనా..? రాజీనామాల పర్వం కొనసాగేనా..?
Nagababu

MAA Elections 2021: మా లో ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయ్. యుద్ధం ముగిసినా వేడి చల్లారడం లేదు. మాలో ఇప్పుడు రాజీనామాల పర్వం నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు రిజైన్లతో సెగలు రేపుతున్నారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. కానీ, ప్రకాష్‌రాజ్ ఓటమిని అతని మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఏకంగా మా సభ్యత్వానికే రాజీనామా చేస్తున్నారు. ప్రకాష్‌రాజ్ పరాజయం తర్వాత మా ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్‌ చేసి మరో సంచలనానికి తెరలేపారు నాగబాబు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్త్తత్వంతో కొట్టుమిట్టాడుతోన్న మాలో ఉండలేనంటూ ట్వీట్ చేశారు. మా సభ్యులు ప్రలోభాలకు గురైనట్లు అర్ధమిచ్చేలా కామెంట్స్ చేశారు. మా ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రకాష్‌రాజ్‌ది కూడా ఇదే మాట. విష్ణు గెలుపును స్వాగతిస్తున్నా అంటూనే… మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయవాదం, జాతీయవాదం మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయవాదమే గెలిచిందంటూ కామెంట్ చేశారు.

నేను తెలుగువాడిని కాదు. నా తల్లిదండ్రులు తెలుగువాళ్లు కాదు. తెలుగువాడిగా పుట్టకపోవడం నా దురదృష్టం. అతిథిగానే వచ్చాను… అతిథిగానే ఉంటాను అంటూ వేదాంతం మాట్లాడారు ప్రకాష్‌రాజ్. మాలో అంతా ఒక్కటేనన్నది పచ్చి అబద్ధమన్నారు ప్రకాష్‌రాజ్. తెలుగువాడే అధ్యక్షుడిగా ఉంటాలనుకున్నారు. నేను తెలుగువాడిని కాకపోవడం నా తప్పా? అంటూ ఆవేదన వ్యకంచేశారు. ఏ ఎన్నికల్లోనైనా ఒక్కరే విజేత ఉంటారు. ఎన్నికలన్నాక ఎన్నో అంశాలు తెరపైకి వస్తాయి. అది ఏదైనా కావొచ్చు. గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతారు. రిగ్గింగ్ చేసి గెలిస్తే తప్పు కానీ ఓటర్ల మద్దతుతో విజయం సాధిస్తే తప్పెలా అవుతుంది. ప్రకాష్ రాజ్ అయినా… నాగబాబు అయినా… ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోతే ఎలా? మా ఫలితాల తర్వాత చిరంజీవి మాట్లాడిన మాటల్లో ఆ ఆవేదన స్పష్టంగా కనిపించింది. పదవులు తాత్కాలికం, ఆధిపత్యం కోసం ఇతరులను కించపర్చొద్దు, అల్లర్లతో మా పరువు తీయొద్దంటూ చిరు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయ్. మరి ముందు ముందు ఇంకేం జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్‌..

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu