‘సాహో’ నష్టాలు..ప్రభాస్‌కు కష్టాలు

'సాహో' నష్టాలు..ప్రభాస్‌కు కష్టాలు

‘సాహో’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రభాస్ ఇమేజ్ ద‌ృష్యా ఈ మూవీ కోసం యూవీ క్రియేషన్స్ దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టింది. హిందీలో కాస్త కలెక్షన్లు ఫరువాలేదనిపించినా..మిగిలిన భాషల్లో సినిమా వసూళ్లను కొల్లగొట్టలేకపోయింది. తన కుటుంబ సభ్యుడు, మరోక ప్రెండ్ వంశీ, ప్రమోద్ నిర్మాతలు కావడంతో సినిమా కోసం ప్రభాస్ ముందుగానే రెమ్యునరేషన్ తీసుకోలేదు. రిలీజైన తర్వాత షేర్ ఇద్దామనే ఆలోచన చేశారు. కానీ ఫేట్ రివర్సయ్యింది. ఫ్రాపిట్స్ పక్కన పెడితే..ఇన్వెస్ట్ చేసిన డబ్బులు […]

Ram Naramaneni

|

Sep 21, 2019 | 8:23 PM

‘సాహో’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రభాస్ ఇమేజ్ ద‌ృష్యా ఈ మూవీ కోసం యూవీ క్రియేషన్స్ దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టింది. హిందీలో కాస్త కలెక్షన్లు ఫరువాలేదనిపించినా..మిగిలిన భాషల్లో సినిమా వసూళ్లను కొల్లగొట్టలేకపోయింది. తన కుటుంబ సభ్యుడు, మరోక ప్రెండ్ వంశీ, ప్రమోద్ నిర్మాతలు కావడంతో సినిమా కోసం ప్రభాస్ ముందుగానే రెమ్యునరేషన్ తీసుకోలేదు. రిలీజైన తర్వాత షేర్ ఇద్దామనే ఆలోచన చేశారు. కానీ ఫేట్ రివర్సయ్యింది. ఫ్రాపిట్స్ పక్కన పెడితే..ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా రాలేదు. ఇక ప్రభాస్‌ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అందంతా పక్కనపెడితే..ఈ సినిమా కోసం చేసిన అప్పులు తీర్చడానికి నిర్మాతలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని సమాచారం. దీనికోసం వారు కొంతమేర మనీని అప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.

ఇప్పటివరకు ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా నెట్ లెక్కల ప్రకారం చూసుకంటే 300 కోట్ల కంటే తక్కువ దగ్గరే ఆగిపోయినట్టు తెలుస్తోంది. అవతల వడ్డీకి తెచ్చిన మనీకి ఇంట్రస్ పెరిగిపోతూ ఉంది. దీంతో మొత్తం కలిపి ప్రభాస్‌కి రెమ్యూనరేషన్ కాకుండా 78 కోట్ల అప్పులు తేలినట్టు వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని తీర్చడం కోసం నిర్మాతలు తమకు ఉన్న ఒక ప్రాపర్టీని అమ్మనున్నట్టు సమాచారం. కానీ ఫ్యామిలీ అండ్ ప్రెండ్స్ అంటే ప్రాణమిచ్చే ప్రభాస్..నిర్మాతలను వారించి..తాను మనీ సమకూరుస్తానని మాటిచ్చాడట. దీంతో రెమ్యూనరేషన్ తీసుకోకపోవడమే కాకుండా..మళ్లీ ఈ అప్పులు కూడా భరించనుండటంతో ప్రభాస్‌పై భారీగానే నష్టాలు రానున్నాయి. ఇదంతా విన్న ఇండస్ట్రీ వర్గాలు అందుకే ప్రభాస్‌ను డార్లింగ్ అంటారని చర్చించుకుంటున్నారట. ఏది ఏమైనా నువ్వు గ్రేట్ “డార్లింగ్”

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu