Bheemla Nayak : పవర్ స్టార్ భీమ్లానాయక్ రన్ టైమ్ గురించి వైరల్ అవుతున్న వార్త.. అదేంటంటే..

Bheemla Nayak : పవర్ స్టార్ భీమ్లానాయక్ రన్ టైమ్ గురించి వైరల్ అవుతున్న వార్త.. అదేంటంటే..
Bheemla Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Rajeev Rayala

|

Jan 25, 2022 | 12:43 PM

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు పవర్ స్టార్. ఈ సినిమా దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే భీమ్లానాయక్ సినిమాకు మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రానా పవన్ పోటీపోటీగా నటించనున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది.

భీమ్లానాయక్ సినిమా రన్ టైమ్ గురించి ఇప్పుడు ఓ ఇంటరెస్టింగ్ రూమర్ వైరల్ గా మారింది. ఈ సినిమాను ముందుగా 2 గంటల 45 నిముషాలు అనుకున్నారట. కానీ అది రిస్క్ అని.. ఇప్పుడు సినిమాలో 30 నిముషాలు కట్ చేశారని అంటున్నారు. మొత్తంగా సినిమా 2గంటల 15 నిముషాలు ఉంటుందని అంటున్నారు. సినిమాలో ఇద్దరు హీరోలు కావడంతో పవన్ స్క్రీన్ స్పేస్- టైమ్ తగ్గుతుందేమో అని అభిమానులు ఆందోళన పడుతున్నారు. కానీ ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ లో పవన్ ఎలివేషన్స్ ఎక్కడా తగ్గవని అర్ధమవుతుంది. మరి ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.. ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తారీకున విడుదల చేసేందుకు ఇప్పటికే డేట్ ను ఖరారు చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu