Pooja Hegde: రిలేషన్‌షిప్‌ గురించి అడిగిన నెటిజన్‌…దిమ్మ తిరిగే సమాధానమిచ్చిన పూజ

పూజా హెగ్డే...ప్రస్తుతం టాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతోన్న హీరోయిన్‌. వరుస సినిమాల్లో నటిస్తూ హిట్ల మీద హిట్లు కొడుతోందీ ముద్దుగుమ్మ.

Pooja Hegde: రిలేషన్‌షిప్‌ గురించి అడిగిన నెటిజన్‌...దిమ్మ తిరిగే సమాధానమిచ్చిన పూజ
సోషల్ మీడియా ఏ మాత్రం క్రేజ్ తగ్గని పూజ హెగ్డే ఫొటోస్

పూజా హెగ్డే…ప్రస్తుతం టాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతోన్న హీరోయిన్‌. వరుస సినిమాల్లో నటిస్తూ హిట్ల మీద హిట్లు కొడుతోందీ ముద్దుగుమ్మ. ‘రాధే శ్యామ్‌’,’ఆచార్య’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోన్న పూజ ఇటీవల ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమాతో మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో ‘విభా’ గా అలరిస్తున్న ఈ అందాల తార తాజాగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. #AskPoojaHegde అంటూ ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది. మరి పూజ- ఆమె అభిమానుల ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి.

‘రాధే శ్యామ్‌’ గురించి ఏమైనా చెప్పండి?
ఎపిక్‌ లవ్‌ స్టోరీ. విజువల్స్‌ అద్భుతంగా, గొప్పగా ఉంటాయి.

దళపతి విజయ్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి?
ఆయన గురించి ఒక్క మాటలో చెప్పలేను. కానీ ప్రయత్నిస్తాను…స్వీటెస్ట్‌

మీ ఫ్యాన్స్‌ గురించి ఒక్క మాటలో?
నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు.

ఇంట్లో తయారుచేసిన ఆహారం ఇష్టమా? లేక బయటి ఆహారం తినడానికి ఇష్టపడతారా?
నాకు ఆహారంతో ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. అయితే ఏదీ మా అమ్మ చేసినంత రుచి ఉండదు.

ఆచార్య లో ‘నీలాంబరి’ పాట ఎలా ఉండనుంది?
ఈ పాట కోసం నేను కూడా మీతో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. పాట చాలా రిచ్‌గా ఉంటుంది. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సాంగ్‌ షూట్‌ చేసిన క్షణాలను జీవితంలో మర్చిపోలేను.

‘కే. జీ. ఎఫ్‌’ హీరో యశ్‌ గురించి ఒక్క మాటలో?
కన్నడ సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తున్నాడు.

స్కూల్లో చదువుకునేటప్పుడు మీకిష్టమైన సబ్జెక్ట్స్‌ ఏంటి?
ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌

ఒత్తిడిని అధిగమించేందుకు ఏం చేస్తారు?
సంగీతమే నా ఒత్తిడిని తగ్గించే థెరపీ. ఇదే నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అండ్‌ లవ్‌. నేను నిరాశలో కూరుకుపోయినప్పుడు సంగీతం బాగా వినేదాన్ని. బాధ కలిగిన సమయంలో మనసారా ఏడ్వడం ద్వారా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. 5 నిమిషాల్లో ఈ పనులన్నీ చేసి మళ్లీ నా పనుల్లో నిమగ్నమవుతాను.

సినిమా కెరీర్‌ ప్రారంభంలో మీకు తగిన గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్థాయిలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. మీ కెరీర్‌లో ఎదుగుదలను చూస్తే మీకెమనిపిస్తుంది?
మొదట్లో ఎన్నో కష్టాలు సవాళ్లు ఎదురయ్యాయి. కొన్ని రోజులు పని కూడా దొరక్కపోవడం నాకు బాగా గుర్తుంది. అయితే పనిపై మనసు పెట్టి కష్టపడితే అదే మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళుతుందని గట్టిగా విశ్వసించాను. నా నమ్మకమే నిజమైంది.

మీ నాన్న నుంచి నేర్చుకున్న 3 విషయాలు?
1.కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం ఉండదు.
2. పని ప్రదేశాల్లోని సమస్యలను ఇంటి దాకా తీసుకురాకూడదు( ఈ విషయంలో ఇటీవల కాస్త మెరుగుపడ్డాను)
3.నీలో ఉన్న చిన్న పిల్లాడిని అణచివేయద్దు

‘ఆచార్య’లో చిరంజీవి గారితో పనిచేశారు కదా…ఆయనతో మీ వర్క్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది?
ఆయన గురించి ఎక్కువగా చెప్పలేను. కానీ నా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా చూసి నా అభినయాన్ని మెచ్చుకుంటూ ఆయన నాకో మెసేజ్‌ పంపారు. ఇది నాకెంత స్ఫూర్తినిచ్చింది.

మెస్సీ/ రొనాల్డో…ఇద్దరిలో ఎవరు మీ ఫేవరెట్‌?
మెస్సీ

భవిష్యత్‌లో ఎవరితో కలిసి నటించడం మీ కల?
అమితాబ్‌ బచ్చన్‌ సార్‌.

జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఒక్కమాటలో?
రియల్‌

మన రిలేషన్‌షిప్‌ గురించి అందరికీ ఎప్పుడు చెబుదాం?
రక్షా బంధన్‌ రోజున

Read Also: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?

అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..

చూపు తిప్పుకొనివ్వని పంజాబీ బ్యూటీ.. మెహ్రీన్ అందమైన ఫోటోస్..

Click on your DTH Provider to Add TV9 Telugu