హరీష్‌ – పవన్‌ మూవీ స్టోరీ లీక్‌..!

హార్డ్ కోర్‌ ఫ్యాన్‌ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఇంకోసారి చూడబోతున్నారా తెలుగు ప్రేక్షకులు? పవన్‌ కల్యాణ్‌ హీరోగా, హరీష్‌ శంకర్‌ డైరక్షన్‌లో చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అని ఎవరిని అడిగినా వస్తున్న సమాధానం ఇదే. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత వారి కాంబినేషన్‌కి వచ్చిన క్రేజ్‌ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా పక్కా ఫ్యాన్ మూమొంట్స్ తో స్క్రిప్ట్ రెడీ అవుతోందట. ఈ నెలాఖరుకి సినిమా స్క్రిప్ట్ పూర్తవుతుంది. జులై ఆఖరునగానీ, ఆగస్టులోగానీ ఈ […]

హరీష్‌ - పవన్‌ మూవీ స్టోరీ లీక్‌..!

హార్డ్ కోర్‌ ఫ్యాన్‌ పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఇంకోసారి చూడబోతున్నారా తెలుగు ప్రేక్షకులు? పవన్‌ కల్యాణ్‌ హీరోగా, హరీష్‌ శంకర్‌ డైరక్షన్‌లో చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అని ఎవరిని అడిగినా వస్తున్న సమాధానం ఇదే. ‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత వారి కాంబినేషన్‌కి వచ్చిన క్రేజ్‌ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా పక్కా ఫ్యాన్ మూమొంట్స్ తో స్క్రిప్ట్ రెడీ అవుతోందట. ఈ నెలాఖరుకి సినిమా స్క్రిప్ట్ పూర్తవుతుంది. జులై ఆఖరునగానీ, ఆగస్టులోగానీ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఈ చిత్రం పవన్‌ పొలిటికల్‌ కెరీర్‌ని కూడా పరోక్షంగా టచ్‌ చేస్తుందని టాక్‌. దానికి తగ్గట్టు ఒన్‌ లైనర్స్ ప్రిపేర్‌ చేసేశారట హరీష్‌ శంకర్‌. ఆల్రెడీ పవన్‌ – హరీష్‌ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్‌ ద్వారా శ్రుతిహాసన్‌కి కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ వచ్చింది. ఈ లేటెస్ట్ మూవీ కోసం కూడా ఆమెనే సంప్రదిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సో శ్రుతి హాసన్‌, పూజా హెగ్డే… వీళ్లిద్దరిలో హీరోయిన్‌గా ఎవరి పేరు ఖరారవుతుందో వేచి చూడాల్సిందే. నిన్నటిదాకా మెగాస్టార్‌ కోసం హరీష్‌ శంకర్‌ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని వార్తలొచ్చాయి. కానీ ఆ స్క్రిప్ట్ మెగా కాంపౌండ్‌లోని పవర్‌ స్టార్‌ కోసమని అఫిషియల్‌గానే ముహూర్తం చూసుకుని అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ మూవీని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu