అమ్మో! నాగశౌర్యతో రొమాన్సా?- సమంత

హైదరాబాద్‌: యంగ్ హీరో నాగశౌర్యతో రొమాన్స్ రక్తికట్టించడం చాలా కష్టమంటుంది టాలీవుడ్ అగ్రకథానాయిక అక్కినేని సమంత. వీరిద్దరు కలిసి నటించిన సినిమా ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని మొదటి పాటకు మంచి స్పందన లభించింది. కాగా రెండో గీతం ‘నాలో మైమరపు..’ను జూన్‌ 10న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు సమంత ప్రకటించారు. ఈ మేరకు సినిమాలో నాగశౌర్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇది సులభమైంది […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:55 pm, Sun, 9 June 19
అమ్మో! నాగశౌర్యతో రొమాన్సా?- సమంత

హైదరాబాద్‌: యంగ్ హీరో నాగశౌర్యతో రొమాన్స్ రక్తికట్టించడం చాలా కష్టమంటుంది టాలీవుడ్ అగ్రకథానాయిక అక్కినేని సమంత. వీరిద్దరు కలిసి నటించిన సినిమా ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని మొదటి పాటకు మంచి స్పందన లభించింది. కాగా రెండో గీతం ‘నాలో మైమరపు..’ను జూన్‌ 10న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు సమంత ప్రకటించారు. ఈ మేరకు సినిమాలో నాగశౌర్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇది సులభమైంది కాదు. నాగశౌర్యతో రొమాన్స్‌ సీన్లు చేయించడం కోసం ఎంత కష్టపడ్డామో నాకు, నందిని రెడ్డికి మాత్రమే తెలుసు. ‘ఓ బేబీ’లోని లవ్‌ సాంగ్‌ జూన్‌ 10న సాయంత్రం విడుదల కాబోతోంది’ అని ట్వీట్‌ చేశారు.

దీన్ని చూసిన నాగశౌర్య బదులిచ్చారు. ‘ఈ పాట కోసం నాలోని రొమాంటిక్‌ కోణాన్ని బయటికి తీసినందుకు నిన్ను ప్రశంసిస్తున్నా సమంత’ అని పోస్ట్‌ చేశారు. ఓ బేబీ’ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, రావు రమేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అడివి శేష్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ప్రీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, సురేష్‌ ప్రొడక్షన్స్‌, గురు ఫిల్మ్స్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2014లో వచ్చిన కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’కి రీమేక్‌ ఇది. 20 ఏళ్ల అమ్మాయి (సమంత) శరీరంలోకి 70 ఏళ్ల వృద్ధురాలు (లక్ష్మి) ప్రవేశించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.