JR NTR and Koratala Siva : కొరటాల సినిమాలో తారక్ పాత్ర అలా ఉండనుందట..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ లో ఉంది.

JR NTR and Koratala Siva : కొరటాల సినిమాలో తారక్ పాత్ర అలా ఉండనుందట..
Jr.ntr
Follow us

|

Updated on: May 01, 2021 | 6:50 AM

JR NTR and Koratala Siva: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ లో ఉంది. ఈ సినిమాలో తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాతో తారక్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోనుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుందని అనౌన్స్ చేశారు. ఆతర్వాత అది క్యాన్సిల్ చేసి కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు తారక్. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రూపొందనుందని ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి లుక్ తో కనిపించనున్నాడు? ఆయన పాత్ర ఎలా ఉండనుంది? అనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొరటాల శివ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండనుందని అంటున్నారు. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెబుతున్నారు. స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడని అంటున్నారు. ఓ బలమైన పాయింట్ తో తారక్ సినిమాను కొరటాల తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే కొరటాల తర్వాత తారక్ మరో దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఉప్పెన’ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన లైన్ ఎన్టీఆర్ కి నచ్చేయడంతో ఆయనతో సినిమా చేయడానికి అంగీకరించినట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్. బుచ్చిబాబు ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్టును రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడని.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఇక్కడ  చదవండి : 

????????? ???????????: డ్యాన్స్ తో అద‌ర‌గొట్టిన ‘జ‌య‌మ్మ‌’.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన వీడియో

RGV Tweet: “2022లో మ‌నుషులు ఉండ‌క‌పోవ‌చ్చు”.. త‌న‌దైన శైలిలో కామెంట్ చేసిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌..

Samantha: `ఈ క‌ష్ట స‌మ‌యంలో మ‌నంద‌రం క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉంది`.. మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సామ్‌..