Devara : ఎన్టీఆర్ ఫ్యాన్ ఇక్కడ.. దేశ వ్యాప్తంగా దేవర సంబరాలు..

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ ఎన్టీఆర్‌కు జోడీగా నటించింది. ఇక దేవర సినిమా రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పై సినిమా మొదటి షోకే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Devara : ఎన్టీఆర్ ఫ్యాన్ ఇక్కడ.. దేశ వ్యాప్తంగా దేవర సంబరాలు..
Devara
Follow us

|

Updated on: Sep 27, 2024 | 7:29 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా నేడు (సెప్టెంబర్ 27న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా  ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ ఎన్టీఆర్‌కు జోడీగా నటించింది. ఇక దేవర సినిమా రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పై సినిమా మొదటి షోకే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్కడ చూసిన జై ఎన్టీఆర్ అనే నినాదం మారుమ్రోగుతోంది. ఆర్ టీ సీ క్రాస్ రోడ్స్ లో జూనియర్ ఎన్ టి ఆర్ ఫాన్స్ సందడి చేశారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు.  ముఖ్యంగా ఆర్ టీ సీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35mm ధియేటర్ వద్ద జూనియర్ ఎన్ టి ఆర్ ఫాన్స్ తో పండగ వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి : Devara Review: దేవర మూవీ రివ్యూ.. ఎర్ర సముద్రం పోటెత్తింది..!

జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇక పాలాభిషేకాలు, పాలాభిషేకాలతో అభిమానులు హోరెత్తించారు. అర్ధరాత్రి 1 గంట షోకు భారీగా తరలివచ్చారు అభిమానులు.. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసుల స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. ఇక ఎన్టీఆర్ సాంగ్స్, డప్పులతో మోత మోగించారు తారక్ ఫ్యాన్స్.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర సినిమా ను పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ కు భారీ కటౌట్స్ పెట్టారు ఫ్యాన్స్. అలాగే విదేశాల్లోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా చూసిన ప్రతిఒక్కరు బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. దాంతో తారక్ ఫ్యాన్స్ ఆనందం డబుల్ అయ్యింది.

కాలభైరవ ట్వీట్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..

ఎన్టీఆర్ ఫాన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.