Tollywood : కాబోయే భర్తతో బ్రేకప్ !!.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ డిలీట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..
ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో సినీప్రపంచంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్, డివోర్స్ ఈ పదాలు చాలా కామన్ అయ్యాయి. తాము ప్రేమలో ఉన్నామంటూ హీరోహీరోయిన్లు, క్రికెటర్స్ ప్రకటిస్తున్నారు. అంతలోనే పెళ్లంటూ హడావిడి చేసేసి.. చివరకు బ్రేకప్.. మేము విడిపోయాము.. మా ప్రైవసీ భంగం కలిగించకండి అంటూ పోస్టులు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సైతం పెళ్లి క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం చాలా మంది సెలబ్రెటీలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అలాగే మరికొందరు తమ లైఫ్ లోకి వచ్చే కొత్త పర్సన్ గురించి బయటపెట్టారు. ఇప్పుడు ఓ హీరోయిన్ మాత్రం తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిన్నటి వరకు క్రికెటర్ స్మృతి మందన, పలాష్ పెళ్లి క్యాన్సిల్ వార్తలు సోషల్ మీడియాను ఊపేశాయి. ఇప్పుడు ఓ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే ఆమె ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు ఆమె ఇన్ స్టా నుంచి అతడి ఫోటోస్ డిలీట్ చేయడంతో పెళ్లి క్యా్న్సిల్ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ నివేదా పేతురాజ్. తెలుగు, తమిళ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
2016లో తమిళంలో వచ్చిన ఓరు నాళ్ కోత్తు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు… శ్రీ విష్ణు నటించిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత అల వైకుంఠపురములో, రెడ్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లతో ఓటీటీ సినీప్రియులను సైతం అలరించింది. పరువు అనే వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కార్ రేసింగ్ పై దృష్టిపై దృష్టిపెట్టింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే దుబాయ్ లో స్థిరపడిన వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్తో ఆమె నిశ్చితార్థం జరిగింది. అతడితో కలిసి ఉన్న ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది నివేదా.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
అయితే ఇప్పుడు ఆమె రాజ్ హిత్ ఇబ్రాన్ తో కలిసి ఉన్న ఫోటోస్ అన్నింటిని డిలీట్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నెట్టింట మాత్రం వీరి పెళ్లి క్యాన్సిల్ అనే టాక్ మాత్రం నడుస్తుంది. ప్రస్తుతం నెట్టింట తన గురించి జరుగుతున్న ప్రచారం పై నివేదా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..




