Nishabdham Movie Review : ‘నిశ్శబ్దం’ మూవీ రివ్యూ

ఓ దర్శకుడు కానీ, రచయిత కానీ మహిళా ప్రాధాన్యం ఉన్న కథ రాసుకుంటే అతడికి ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క. ప్రస్తుతం స్టార్ హీరోలతో సమానంగా అనుష్క మార్కెట్ రేంజ్ ఉంటుంది.

Nishabdham Movie Review : ‘నిశ్శబ్దం’ మూవీ రివ్యూ
Follow us

|

Updated on: Oct 02, 2020 | 4:00 PM

చిత్రం: నిశ్శబ్దం

నటీనటులు: అనుష్క, మాధవన్‌, అంజలి,  షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల, మైకేల్ మాడిసన్‌

సంగీతం: గోపీ సుందర్‌

నిర్మాత: కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌

కథ, దర్శకత్వం: హేమంత్‌ మధుకర్‌

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌

ఓ దర్శకుడు కానీ, రచయిత కానీ మహిళా ప్రాధాన్యం ఉన్న కథ రాసుకుంటే అతడికి ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క. ప్రస్తుతం స్టార్ హీరోలతో సమానంగా అనుష్క మార్కెట్ రేంజ్ ఉంటుంది. తాజాగా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క కీలక పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క ఈ చిత్రంలో దివ్యాంగురాలి(మూగ/చెవిటి)గా నటించడం వల్ల సినిమాపై మరింత బజ్ పెరిగింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ వేదికగా విడుదలయ్యింది.  మరి ‘నిశ్శబ్దం’ ఎలా ఉంది? అనుష్క  మరోసారి మెస్మరైజ్ చేసిందా? సినిమాలో ఆకట్టుకునే అంశాలేమిటో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

అమెరికాలోని సియాటెల్‌కు 70 కి.మీ దూరంలో ఉన్న వుడ్‌సైడ్‌ విల్లాలో  భార్యాభ‌ర్త‌లు పీట‌ర్, మెలిసాలను దుండగులు హత్య చేస్తారు.  ఇంటి ఓనర్  జోసెస్  ఆత్మే వారిని చంపేసిందంటూ ప్రచారం జరుగుతుంది. పోలీసులు కూడా ఈ కేసును ఛేదించ‌లేక ముప్పుతిప్పలు పడతారు. దీంతో హాంటెడ్ హౌస్ గా భావించే ఆ విల్లాను కొనేందుకు ఎవరూ ముందుకు రారు. 2019లో కొలంబియాకు చెందిన బిజినెస్‌మేన్ మార్టిన్ ఎస్క‌వాడో ధైర్యం చేసి ఆ విల్లాను  కొంటాడు. సాక్షి (అనుష్క) చెవిటి, మూగ అమ్మాయి. కానీ, మంచి పెయింటర్. మరోవైపు ఆంటోని (మాధవన్) సెలబ్రిటీ మ్యుజీషియన్. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది  ప్రేమగా మారుతుంది. ఎంగేజ్‌మెంట్ తరవాత ట్రిప్ లో భాగంగా వీరిద్దరూ కలిసి హాంటెడ్ హౌస్ గా భావించే ఆ విల్లాలోకి సాక్షి, ఆంటోని వ‌స్తారు. ఇప్పుడు అదే ఇంటిలో ఆంటోని కూడా హత్యకు గురవుతాడు. కానీ, సాక్షి గాయాల‌తో తప్పించుకుంటుంది. అసలు ఆంటోనిని హత్య చేసింది ఎవరు? మూగ అమ్మాయి అయిన సాక్షి పోలీసులకు ఎలా సహకరించింది? పోలీస్‌ ఆఫీసర్‌ అయిన రిచర్డ్‌(మైకేల్‌ మాడిసన్‌), క్రైమ్‌ డిటెక్టివ్‌ మహాలక్ష్మి(అంజలి)తో కలిసి ఎలా చేధించారు.  ఈ హత్యకూ సోనాలి(షాలినీ పాండే), వివేక్‌(సుబ్బరాజు)లకు ఉన్న సంబంధం ఏంటి?  అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే :

సరిగ్గా తీయాలే గానీ క్రైమ్ థిల్లర్స్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. స్క్రీన్ ప్లే ఇలాంటి సినిమాలకు ప్రధాన బలం. ఎందుకంటే ఇటువంటి సినిమాలకు నేపథ్యాలు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. తన గత చిత్రాలతో పెద్దగా మెప్పించలేకపోయిన దర్శకుడు హేమంత్ మధుకర్.. ‘నిశ్శబ్దం’ కథను మాత్రం పవర్ ఫుల్ గా రాసుకున్నారు. కథ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆంటోని హత్యతో ఓ పెద్ద చిక్కుముడి వేసి…దాని చుట్టూ పాత్రలు మలచుకుని ఆసక్తి కలిగించాడు. అయితే సినిమా సగం పార్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. మధ్యలో నుంచి కాస్త గాడితప్పినట్లు అనిపిస్తుంది. అప్పటివరకూ ఆ హత్యను ఎవరెవరు చేసి ఉంటారని ఊహిస్తున్న ప్రేక్షకుడు.. విరామ సమయానికొచ్చే సరికి ఒక వ్యక్తి దగ్గర ఆగిపోతాడు. అయితే, ఆ వ్యక్తి ఆంటోనిని ఎందుకు హత్య చేశాడన్న కోణంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ్నుంచి కథ ప్రేక్షకుడి ఊహాజనితంగానే ఉంటుంది. కొన్ని ట్విస్టలు బాగున్నాయి. వాటిని రివీల్ చేసే విధానం ఇంకా ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది.   సినిమా మొత్తాన్ని అమెరికా నేపథ్యంలోని సీటల్, సీక్విమ్ నగరాల పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించడంతో హాలీవుడ్ లుక్ వచ్చింది.

ఎవరెలా చేశారంటే : 

దివ్యాంగురాలి పాత్రలో అనుష్క అదరగొట్టింది. ఇలాంటి ఛాలెజింగ్ పాత్రలకు తానెంత అవసరమో మరోసారి నిరూపించింది. సైగలు, హావభావాలతో ఎమోషన్స్ పలికించడంలో ఆమె పడిన కష్టం అర్థమవుతుంది. సెలబ్రిటీ మ్యుజీషియన్ గా మాధవన్‌ చక్కగా నటించారు. కేసు ఛేదించే డిటెక్టివ్‌గా అంజలి నటన ఓకే. రిచర్డ్‌ పాత్రలో హాలీవుడ్‌ నటుడు మైకేల్ మాడిసన్‌ను తీసుకోవడం వల్ల సినిమాకు పెద్ద ప్రయోజనం ఏమీ కనిపించలేదు. సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం : 

గోపీ సుందర్‌ అందించిన రెండు పాటలు బాగున్నాయి. షనీల్ డియో కెమెరా పనితనం గొప్పగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. గిరీష్ గోపాలక్రిష్ణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.  ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ బాగుంది. కోన వెంకట్ స్క్రీన్ ప్లే పై కాస్త ఫోకస్ పెడితే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • అనుష్క, మాధవన్‌ల నటన
  • సాంకేతిక విభాగం పనితీరు

మైనస్ పాయింట్స్ : 

  • స్లో స్క్రీన్ ప్లే
  • ప్లో దెబ్బతినే కొన్ని సీన్స్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా