Nayanthara: మంచి మనసు చాటుకున్న స్టార్ కపుల్.. నయన్, విగ్నేష్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు

నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నయన్.

Nayanthara: మంచి మనసు చాటుకున్న స్టార్ కపుల్.. నయన్, విగ్నేష్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు
Nayanthara, Vignesh Shivan
Follow us

|

Updated on: Jan 04, 2023 | 4:43 PM

స్టార్ హీరోయిన్ నయనతార గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. తమిళ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. ఇక నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నయన్. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు నయన్. పెళ్లి తర్వాత సినిమాల విషయాంలో ఆచితూచి అడుగులేస్తోంది నయన్. రీసెంట్ గానే కనెక్ట్ అనే సినిమా చేసింది. ఇటీవలే నయన్ , విగ్నేష్ లు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది నయన్. భర్త తో కలిసి విదేశాలలో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూంది నయన్.

తాజాగా ఈ దంపతులు కొత్త ఏడాది సందర్భంగా రోడ్డు పక్కన ఉండే పిల్లలకు గిఫ్ట్ లు పంచి పెట్టారు. దంపతులు ఇద్దరు కలిసి ఆ గిఫ్ట్ లను పేద పిల్లలకు పంచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయన్ తన భర్త తో కలిసి ఇలా రోడ్డు పక్కన నివాసం ఉండే పేద పిల్లలకు గిఫ్ట్ లు పంచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

నయన్ దంపతులు చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. శబాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..