న‌వ‌దీప్ సిక్స్ ప్యాక్ కి స్పూర్తి ఎవ‌రో తెలుసా..?

సిక్స్ ప్యాక్ అంటే చాలు..టాలీవుడ్ లో అల్లు అర్జున్ గుర్తొస్తాడు. 'దేశముదురు' సినిమాలో ఆరు ప‌ల‌క‌ల దేహంతో క‌నిపించి...ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేశాడు.

న‌వ‌దీప్ సిక్స్ ప్యాక్ కి స్పూర్తి ఎవ‌రో తెలుసా..?
Ram Naramaneni

|

Jun 17, 2020 | 2:08 PM

సిక్స్ ప్యాక్ అంటే చాలు..టాలీవుడ్ లో అల్లు అర్జున్ గుర్తొస్తాడు. ‘దేశముదురు’ సినిమాలో ఆరు ప‌ల‌క‌ల దేహంతో క‌నిపించి…ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేశాడు. ఆ తర్వాత చాలామంది కుర్ర హీరోలు బ‌న్నీని ఆద‌ర్శంగా తీసుకుని సిక్స్ ఫ్యాక్ ల‌తో సిల్వ‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేశారు. అలాంటివారిలో టాలెంటెడ్ యాక్ట‌ర్ న‌వ‌దీప్ కూడా ఉన్నాడు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్​తో ముచ్చటించిన నవదీప్ తాను అల్లు అర్జున్​ను స్ఫూర్తిగా తీసుకునే సిక్స్ ప్యాక్ బాడీ కోసం వ‌ర్కవుట్స్ చేసిన‌ట్టు తెలిపాడు.

కాగా తాను ఓ రొమాంటిక్ ఫాంటసీ మూవీ కోసం బాడీ పెంచానని, కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదని చెప్పుకొచ్చాడు న‌వ‌దీప్. ప్రస్తుతం టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ లో న‌టిస్తోన్న న‌వ‌దీప్.. పలు వెబ్​ సిరీస్​ల్లో కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఇటీవ‌ల ఇత‌డు త‌న స్నేహితుడైన అల్లు అర్జున్ ‘అల‌..వైకుంఠపురం’ సినిమాలో మంచి పాత్ర చేసి..ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొన్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu