Colour Photo: ”చాలా సంతోషంగా, గర్వంగా ఉంది”.. కలర్ ఫోటో సినిమా పై నాని ప్రశంసలు

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈ కార్యక్రమం ఢిల్లీ లో అట్టహాసంగా జరిగింది.  సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు దక్కాయి.

Colour Photo: ''చాలా సంతోషంగా, గర్వంగా ఉంది''.. కలర్ ఫోటో సినిమా పై నాని ప్రశంసలు
Nani
Follow us

|

Updated on: Jul 22, 2022 | 8:51 PM

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈ కార్యక్రమం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇక జాతీయ తెలుగు ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది కలర్ ఫోటో(Colour Photo) సినిమా. చిన్న సినిమాగా 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో రిలీజ్ అయిన ఈ సినిమా జాతీయ స్థాయిలో మన్ననలు పొదడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. పీరియడ్‌ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్‌ డైరెక్ట్ చేశారు. సుహాస్, షార్ట్ ఫిల్మ్స్‌ ఫేమస్ చాందినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు. పోలీస్‌ క్యారెక్టర్లో.. పవర్‌ ఫుల్ విలన్‌గా సునీల్ కనిపించారు.

ఇక ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ను అమృత ప్రొడక్షన్స్ అండ్‌ లౌక్యా ఎంటర్టైన్మెంట్స్‌ ప్రొడ్యూస్ చేసింది. అయితే కోవిడ్ కారణంగా.. తెలుగు ఓటీటీ ఆహాలో రిలీజై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా కట్టిపడేసింది. సినిమా చూస్తున్నంత సేపు ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు జాతీయ ఉత్తమ తెలుగు సిమాగా నిలిచింది. ఈ సందర్భంగా హీరో నాని కలర్ ఫోటో సినిమా టీమ్ ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. చాలా సంతోషంగా గర్వంగా ఉంది అంటూ నాని ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి