Nandamuri Balakrishna: వేట కొడవళ్లతో వీరావేశంగా రానున్న బాలయ్య.. గోపీచంద్ సినిమాలో ఇలా..

అఖండలో శూలాన్ని చేతపట్టి శత్రు సంహారాన్ని పూర్తి చేసిన బాలయ్య.. తన నెక్ట్స్‌ సినిమాలో వేట కొడవళ్లతో... వీరావేశంగా ఊగిపోనున్నారు.

Nandamuri Balakrishna: వేట కొడవళ్లతో వీరావేశంగా రానున్న బాలయ్య.. గోపీచంద్ సినిమాలో ఇలా..
Balakrishna
Follow us

|

Updated on: Dec 18, 2021 | 3:23 PM

Nandamuri Balakrishna: అఖండలో శూలాన్ని చేతపట్టి శత్రు సంహారాన్ని పూర్తి చేసిన బాలయ్య.. తన నెక్ట్స్‌ సినిమాలో వేట కొడవళ్లతో… వీరావేశంగా ఊగిపోనున్నారు. తనకు అచ్చోచే రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో మరో సినిమాతో మనముందుకు రాబోతున్నారు. క్రాక్‌ డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో మరో పవర్‌ ఫుల్ రోల్‌తో మన ముందుకు రాబోతున్నారు. అయితే లెటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సినిమాకు ‘వేటపాలెం’ అనే పేరును ఖరారు చేశారట. బాలయ్య ఇమేజ్‌కు… కథకు..కథనానికి ఈ పేరు సరిగ్గా సూట్ అవుతుండడంతో… డైరెక్టర్ గోపీచంద్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇక పేరుకు బాలయ్య కూడా ఓకే చెప్పడంతో… తొందర్లో ఈ టైటిల్‌ను అఫీషియల్ గా అనౌన్స చేయనున్నారట మేకర్స్.

అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 20 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్ ను వెళ్లనుందట. అందుకోసం డైరెక్టర్‌ గోపీ ఇప్పటి నుంచే కొన్ని సెట్‌ పనులను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య  సక్సెస్ ఫుల్ దర్శుడు అనీల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధంచేశాడట అనీల్. ఈ సినిమాకూడా తనదైన మార్క్ కామెడీతో సాగుతుందని తెలుస్తుంది. సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి కథను , నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట అనీల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: ప్రభాస్ సినిమా ప్రీరిలీజ్‌‌కు ముహూర్తం ఖరారు.. ఘనంగా రాధేశ్యామ్ ఈవెంట్..

Bangarraju Movie: వాసివాడి తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..

Nani: ఆ దర్శకుడితో అప్పుడు కుదరలేదు.. ఇప్పుడు వస్తే వదులుకోను.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్