Krishna Vrinda Vihari :ప్రమోషన్స్‌లో కొత్తపుంతలు.. ఏకంగా పాదయాత్ర చేస్తామంటున్న మూవీ టీమ్..

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఓ బేబీ సినిమా తర్వాత శౌర్యకు చెప్పుకోదగ్గ హిట్ రాలేదు.

Krishna Vrinda Vihari :ప్రమోషన్స్‌లో కొత్తపుంతలు.. ఏకంగా పాదయాత్ర చేస్తామంటున్న మూవీ టీమ్..
Krishna Vrinda Vihari
Follow us

|

Updated on: Sep 13, 2022 | 7:16 PM

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఓ బేబీ సినిమా తర్వాత శౌర్యకు చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. ప్రస్తుత కుర్ర హీరో ఆశలన్నీ కృష్ణ వ్రింద విహారి(Krishna Vrinda Vihari )సినిమాపైనే పెట్టుకున్నాడు. అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పాటలు, టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ట్రెండింగ్ లో కొనసాగుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 14 – తిరుపతి, సెప్టెంబర్ 15 – నెల్లూరు, ఒంగోలు, సెప్టెంబర్ 16 – విజయవాడ, గుంటూరు, ఏలూరు, సెప్టెంబర్ 17 – భీమవరం, రాజమండ్రి, సెప్టెంబర్ 18 – కాకినాడ , వైజాగ్ లో హీరో నాగశౌర్యతో పాటు చిత్ర యూనిట్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులు, అభిమానులని కలసి సందడి చేయనుంది. అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.  సెప్టెంబర్ 23న విడుదల చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..