Naga Chaitanya- Sobhita: అక్కినేని ఇంట పెళ్లి సందడి షురూ.. నాగ చైతన్య, శోభితలకు మంగళ స్నానాలు.. వీడియో ఇదిగో

అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహానికి అంగరంగా వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా తాజాగా కాబోయే వధూవరులిద్దరికీ మంగళ స్నానాలు చేయించారు.

Naga Chaitanya- Sobhita: అక్కినేని ఇంట పెళ్లి సందడి షురూ.. నాగ చైతన్య, శోభితలకు మంగళ స్నానాలు.. వీడియో ఇదిగో
Naga Chaitanya, Sobhita
Follow us
Basha Shek

|

Updated on: Nov 29, 2024 | 4:18 PM

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్లల వివాహానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఇందుకోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇరు ఫ్యామిలీస్ లోనూ పెళ్లి పనులు షురూ అయ్యాయి. తాజాగా నాగ చైతన్య, శోభిత ఇళ్లలో హల్దీ వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు కాబోయే వధూవరులను ఒకేచోట ఉంచి హల్దీ వేడుకను నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఇద్దరికీ మంగళస్నానాలు చేయించారు.ఈ సందర్భంగా చై, శోభితలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు ముందుస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నాగచైతన్య-శోభిత పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. ఈ వేడుక కోసం అన్నపూర్ణ స్డూడియోస్ లో ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. దివంగత ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా శోభిత మెడలో చై మూడుముళ్లు వేయనున్నారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 300 మంది సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. టాలీవుడ్ నుంచి దగ్గుబాటి, మెగా, నందమూరి ఫ్యామిలీలలోని అందరూ ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు.  కాగా నయన తార- విఘ్నేష్ శివన్ ల పెళ్లి తరహాలోనే నాగ చైతన్య- శోభితల పెళ్లి వేడుకు ఓ ప్రముఖ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వనుందని ప్రచారం జరిగింది.

ఇవి కూడా చదవండి

హల్దీ వేడుకలో నాగ చైతన్య, శోభిత..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు నాగ చైతన్య. చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగ చైతన్య, శోభితల ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.