Krithi Shetty: కృతి శెట్టి సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్.. ప్రకటించిన చిత్రయూనిట్..
డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో టాలెంటెడ్ హీర్ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.
డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో టాలెంటెడ్ హీర్ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతోన్న మూడవ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామి అయ్యింది. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్‌ను ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా ఆహ్వానించడం గర్వంగా ఉందని మెంచ్ మార్క్ స్టూడియోస్ ప్రకటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్, అందమైన ప్రేమ కథగా రాబోతోన్న ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లొకి రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను త్వరలోనే చిత్రయూనిట్ విడుదల చేయనుంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. పీజీ విందా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఇందులో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
TFI’s stalwart production house @mythriofficial collaborates with @benchmarkstudi5 for #AaAmmayiGurinchiMeekuCheppali Dir by #MohanaKrishnaIndraganti. ⭐ing @isudheerbabu & @iamkrithishetty. ??https://t.co/NDNO9fZq2Z pic.twitter.com/huRmxY2ciq
— Hyderabad Times (@hyderabadtimes) December 29, 2021
Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్