డైలాగ్ కింగ్ న‌యా వెర్ష‌న్, త్వ‌ర‌లో డైరెక్ష‌న్

మ‌న టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ద‌ర్శ‌క‌త్వ శాఖ నుంచి హీరోలుగా మారిన‌వారే. చిరంజీవి, మోహ‌న్ బాబు ద‌గ్గ‌ర్నుంచి నాని, రాజ్ త‌రుణ్ వ‌రకు అంద‌రూ ఈ కోవ‌కు చెందిన‌వారే.

  • Ram Naramaneni
  • Publish Date - 10:58 am, Tue, 25 August 20
డైలాగ్ కింగ్ న‌యా వెర్ష‌న్, త్వ‌ర‌లో డైరెక్ష‌న్

మ‌న టాలీవుడ్‌లో చాలా మంది అగ్రక‌థానాయ‌కులు ద‌ర్శ‌క‌త్వ శాఖ నుంచి వ‌చ్చి హీరోలుగా మారిన‌వారే. చిరంజీవి, మోహ‌న్ బాబు ద‌గ్గ‌ర్నుంచి నాని, రాజ్ త‌రుణ్ వ‌రకు అంద‌రూ ఈ కోవ‌కు చెందిన‌వారే. ఎంత స్టార్ హీరోలు అయిన‌ప్ప‌టికీ, వారిలో ద‌ర్శ‌క‌‌త్వం వ‌హించాల‌న్న త‌ప‌న ఉంటూనే ఉంటుంది. అయితే సీనియ‌ర్ హీరో మోహ‌న్‌బాబు త్వ‌ర‌లోనే ఆ క‌ల‌ను నిజం చేసుకోబోతున్నారు. ఆయ‌న డైరెక్షన్ చేయ‌డానికి రంగం సిద్ద‌మైన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

త్వరలోనే డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాలో న‌టించ‌బోతున్న‌ మోహన్‌బాబు.. ఆ చిత్రం తర్వాత మోగాఫోన్‌ పట్టబోతున్నారు. అందుకోసం ఇప్పటికే స్టోరీని కూడా రెడీ చేయించారు. అందులో నటించే యాక్ట‌ర్స్, సాంకేతిక నిపుణులు ఎవ‌రో తెలియాలంటే మ‌రికొంత‌కాలం వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా ఇండ‌స్రీలో త‌న మార్క్ చూపించారు మోహన్‌బాబు. త్వరలో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో కీల‌క పాత్ర‌లో పలకరించనున్నారు మోహన్​బాబు. సినిమా తమిళ వెర్షన్​లోని తన పాత్రకు మోహన్​బాబే స్వయంగా డబ్బింగ్​ చెప్పుకున్నారు కూడా. అక్టోబర్​ 30న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్​లో విడుదల కానుందీ సినిమా.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌