Allu Arjun Arrest: అల్లు అర్జున్‌‌ అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు చిరంజీవి…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ భార్య స్నేహ కన్నీరు పెట్టుకోగా, ఆమెను ఓదార్చారు అర్జున్.

Allu Arjun Arrest: అల్లు అర్జున్‌‌ అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు చిరంజీవి...
Allu Arjun - Chiranjeevi
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2024 | 2:21 PM

సినీ నటుడు అల్లు అర్జున్‌ను  చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.  డిసెంబర్‌ 4, రాత్రి 9గంటలకు హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌కు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగింది. గేట్ దగ్గరకు జనాలు చొచ్చుకురావడంతో అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇంకా చికిత్స పొందుతున్నారు.  ఆ తర్వాత  ఈ ఘటనపై స్పందించారు అల్లు అర్జున్‌. రేవతి గారి ఫ్యామిలీకి అల్లు అర్జున్‌ సంతాపం తెలియజేశారు. తన తరఫున బాధిత కుటుంబానికి 25లక్షలు అందిస్తానని చెప్పారాయన.

అయితే అల్లు అర్జున్‌తో పాటు సంధ్య యాజమాన్యం అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బందిపై కేసు నమోదైంది. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని పోలీసులు ఆరోపించారు. అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని, సంధ్య థియేటర్ యాజమాన్యం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అది బెనిఫిట్ షో కావడంతో థియేటర్‌తో సంబంధం లేకుండా ఎగ్జిబిటర్స్ ఆ షో ప్రదర్శించారని థియేటర్ యాజమాన్యం పిటిషన్‌లో పేర్కొంది.

ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు హీరో అల్లు అర్జున్‌. సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం.. గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆ తర్వాత న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నారు.

కాగా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తెలిసిన వెంటనే.. చిరంజీవి షాక్‌కు గురయ్యారు. విశ్వంభర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని.. వెంటనే పోలీస్ స్టేషన్‌కు బయలుదేరినట్లు తెలిసింది.

అల్లు అర్జున్‌పై BNS 118 (1), BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయినట్లు సమాచారం.  105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు.   నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి పదేళ్లు జైలుశిక్షపడే అవకాశం ఉంది.  BNS 118 (1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే చాన్స్ ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.  సెక్షన్‌ 105 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే..  5 నుంచి 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.  118(1) కింద ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని గాయపరిస్తే 3 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అమితాబ్ తర్వాత అమీర్‌.. బాలీవుడ్‌ స్టార్లతో రజినీ మాస్టర్ ప్లాన్
అమితాబ్ తర్వాత అమీర్‌.. బాలీవుడ్‌ స్టార్లతో రజినీ మాస్టర్ ప్లాన్
ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. సీరియస్ అయిన సాయి పల్లవి
ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తున్నారు.. సీరియస్ అయిన సాయి పల్లవి
నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో
నాన్న నువ్వు నా ప్రాణం.. మంచు మనోజ్ స్పెషల్ వీడియో
6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..
6 రోజుల్లో 1000 కోట్లు.. బన్నీ బన్‌గయా ఇండియా నెం1 స్టార్..
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా..
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూడగా..
హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. పెట్టిన కేసులు ఇవే..
హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. పెట్టిన కేసులు ఇవే..
ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు