Megastar Chiranjeevi: ‘ఆ సమయంలో కొన్ని గంటలు వణికిపోయాను.. నిద్రకూడా పోలేదు’.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్.

ఈ మూవీ రిలీజ్ ముందు తనకంటే తన భార్య సురేఖ ఎక్కువ టెన్షన్ పడిందని.. ఆమెను చూసి తనకు కూడా భయం వేసిందన్నారు. అంతేకాదు.. విడుదలకు ముందు రోజు నిద్రపోలేదని.. కొన్ని గంటల పాటు వణికిపోయానని అన్నారు.

Megastar Chiranjeevi: 'ఆ సమయంలో కొన్ని గంటలు వణికిపోయాను.. నిద్రకూడా పోలేదు'.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్.
Chiranjeevi
Follow us

|

Updated on: Oct 09, 2022 | 11:18 AM

ఆచార్య డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట సందడి చేస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్‏ను హైదరాబాద్‏లో శనివారం సాయంత్రం నిర్వహించారు చిత్రయూనిట్. ఈ సినిమా అనుభవాలను పంచుకున్నారు. ఈ మూవీ రిలీజ్ ముందు తనకంటే తన భార్య సురేఖ ఎక్కువ టెన్షన్ పడిందని.. ఆమెను చూసి తనకు కూడా భయం వేసిందన్నారు. అంతేకాదు.. విడుదలకు ముందు రోజు నిద్రపోలేదని.. కొన్ని గంటల పాటు వణికిపోయానని అన్నారు. ప్రేక్షకుల అందించిన విజయంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ సినిమా మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయింది. సత్యదేవ్, నయనతార సీన్స్ కూడా అయిపోయాయి. దీంతో వాళ్లకు వేరే సినిమాలు చేసుకోవచ్చు అని కూడా చెప్పాం. కానీ క్లైమాక్స్ చూస్తుంటే సత్యదేవ్ మీద జాలి కలుగుతోంది. మనిషి ఒక్కసారిగా డల్ అయిపోయాడు. అలాంటి వ్యక్తిని కాల్చడం నాకే నచ్చలేదు. దీంతో అతని పాత్రకు ఇంకా క్రూరత్వం పెంచాలి అనుకున్నా. ఇదే విషయాన్ని రాజాకు చెప్పాను.

తర్వాత టీం కూర్చొని మళ్లీ ప్లాన్ చేసి.. చివరి నిమిషంలో చెల్లెలును చంపేందుకు సత్యదేవ్ ప్లాన్ చేయడం.. ఆ యాక్సిడెంట్, అతను ఫెయిల్ కావడం.. నేను అప్పటికే నా మనుషులను అక్కడ పెట్టడం.. నా తండ్రిని ఎలా చంపాడో.. అతడిని కూడా అలాగే చంపేందుకు ప్లా్న్ చేసి రీషూట్ చేశాం. అది కూడా సినిమా విడుదలకు 15 రోజుల ముందు షూట్ చేశాం ” అంటూ చెప్పుకొచ్చారు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!