Mega 154 : మెగాస్టార్ – బాబీ కాంబోలో రాబోయే సినిమా టైటిల్ ఇదేనా.. దాదాపు ఇదే ఫిక్స్ అంటున్నారే..

మెగాస్టర్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాలతో ఫుల్ బిజీ ఆన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో..Mega 154

Mega 154 : మెగాస్టార్ - బాబీ కాంబోలో రాబోయే సినిమా టైటిల్ ఇదేనా.. దాదాపు ఇదే ఫిక్స్ అంటున్నారే..
Chiru
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2021 | 7:06 AM

Mega 154 : మెగాస్టర్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాలతో ఫుల్ బిజీ ఆన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈ సినిమాలో చిరు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నపాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మలయాళ సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ మూవీకు తమిళ్ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ చేయనున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గాడ్ ఫాదర్ సినిమాతోపాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమా తమిళ్‌లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్‌గా రానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్‌గా క్ర్తిసురేష్ నటిస్తుంది. ఈ సినిమాలతోపాటు యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో బాస్ ఒక సినిమా చేస్తున్నారు. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. వాటిలో బాబీ సినిమా పోస్టర్ ప్రేక్షకులకు మరింతగా ఆకట్టుకుంది.

ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనప్పటికీ ప్రీలుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఊర మాస్ గెటప్‌లో బాస్‌‌‌‌ను చూసిన ఫ్యాన్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. అయితే ఈ సినిమా టైటల్ ఇదే అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నారనే హింట్ ఇచ్చాడు బాబీ. మెగాస్టార్ 154సినిమాకు `వాల్తేరు వీరన్న` అనే టైటిల్ ప్రచారంలో ఉందని టాక్ నడుస్తుంది. మెగాస్టార్ గెటప్‌కు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సూటవుతుందని చిత్రయూనిట్ భావిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Niharika Konidela: బిగ్ బేబీ బ్రదర్‌తో రాఖీ సెలబ్రేషన్స్ .. ఈ ఫొటోలో ఉంది ఎవరో గుర్తుపట్టండి అంటున్న నిహారిక

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తలైవి మూవీ విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Allu Arjun Pooja Hegde: అల్లు అర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ మళ్లీ రిపీట్‌కానుందా..!