Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గని. కిరణ్ కొర్రుపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించనున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాను సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్లు ‘గని’పై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అలాగే గని టైటిల్ ను సాంగ్ ను కూడా విడుదల చేశారు. ఇక గని సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ప్రొఫిషనల్ బాక్సర్ గా కనిపించడానికి వరుణ్ శిక్షణ కూడా తీసుకున్నాడు.
ఈ సినిమాను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నదియా మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుహ్యంగా ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత ఇప్పుడు మార్చి 18న రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ అభిమానులకు, ప్రేక్షకులను నూతన సంవత్సర విషెస్ తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేశాడు.
This year let’s fight for what is right, and for what we believe in! 🥊👊
Wishing you all a very happy and prosperous new year! ✨ #HappyNewYear2022 #Ghani @IAmVarunTej @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic #GhaniOnMarch18th pic.twitter.com/PQqVRw1eXi
— BA Raju’s Team (@baraju_SuperHit) January 1, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :
Deepthi Sunaina-Shanmukh: షణ్ముఖ్‌తో బ్రేకప్.. భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన దీప్తి సునయన..
Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..