Viral Photo: పవన్, రవితేజల సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?

Viral Photo: పవన్, రవితేజల సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?
Heroine Viral Photo

చేసినవి కొన్ని సినిమాలైన కొంతమంది హీరోయిన్స్.. ప్రేక్షకులకు మరిచిపోలేని ఇంపాక్ట్ ఇస్తారు. వారి పేరు చెప్పగానే ఆ పాత్రలు అలా కళ్లముందు మెదులుతాయి. అలాంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వా

Ram Naramaneni

|

Jan 27, 2022 | 9:28 PM

Tollywood Heroine: చేసినవి కొన్ని సినిమాలైన కొంతమంది హీరోయిన్స్.. ప్రేక్షకులకు మరిచిపోలేని ఇంపాక్ట్ ఇస్తారు. వారి పేరు చెప్పగానే ఆ పాత్రలు అలా కళ్లముందు మెదులుతాయి. అలాంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారిలో ముందు వరసలో ఉంటారు.. మీరా జాస్మిన్(Meera Jasmine). పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది ఈ హీరోయిన్.  అమాయకత్వంతో నిండిన పాత్రలు చేయాలంటే అప్పట్లో మీరా జాస్మిన్ ఫస్ట్ ఆప్షన్. తన అభినయం, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది ఫాలోవర్స్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కేరళ(Kerala)కు చెందిన ఈ నటి ఎక్స్‌పోజింగ్‌కు ఎప్పుడూ దూరమే. 2001-2010 కాలంలో స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. తెలుగు(Telugu), తమిళ(Tamil),  మలయాళం భాషల్లో న‌టించిన జాతీయ ఉత్త‌మ న‌టిగా గుర్తింపు పొందింది. ఈ హీరోయిన అసలు పేరు జాస్మిన్‌ మేరి జోసెఫ్‌. మీరా బ్రదర్ జార్జ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మీరా డిగ్రీ చదువుతున్న రోజుల్లో బ్లెస్సి అనే అసిస్టెంట్ డైరక్టర్ ఆమెను చూసి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆహ్వానించాడు. ఫేమస్ డైరెక్టర్ లోహిత్‌ దాస్‌కు మీరాని పరిచయం చేసి మలయాళం మూవీ ‘సూత్రధారన్‌’లో ఛాన్స్ ఇప్పించాడు. ఆ తర్వాత మీరాకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

‘పాదమ్ ఒన్ను ఒరు విలాపం’ మూవీ మీరా జాస్మిన్ కు ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డును తెచ్చిపెట్టింది. రవితేజతో భద్ర, పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్, విశాల్‌తో పందెం కోడి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. ‘గోరింటాకు’ సినిమాలో హీరో రాజ‌శేఖ‌ర్ కు సోదరిగా బరువైన పాత్ర చేసి..  తెలుగు మహిళల మనసుల్లో పర్మనెంట్ ప్లేస్ దక్కించుకుంది. మీరా.. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నప్పటికి.. ఇండస్ట్రీ వైపు చూడలేదు. కొంతకాలం క్రితం ఓ మలయాళం సినిమాలో గెస్ట్ రోల్‌లో మీరా కనిపించింది. అయితే ప్రజంట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. అందుకోసం వ‌ర్క్ అవుట్స్ చేసి వెయిట్ లాస్ అయింది. అంతేకాదు ఊహించని విధంగా గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది.

Also Read: Andhra Pradesh: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పాఠశాలలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu