Meera Jasmine: మీరా జాస్మిన్ టాలీవుడ్ రీ ఎంట్రీ ఫిక్స్.. ఈసారి క్యూట్‌గా కాదు.. కాస్త ఘాటుగా..
తన పాత్ర డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపింది మీరా జాస్మిన్. ఆ వివరాలు మీ కోసం...
మీరా జాస్మిన్… ఒక 15 ఏళ్ల క్రితం ఈ నటి కుర్రాళ్ల హార్ట్ త్రోబ్. టాలీవుడ్ బడా హీరోల సరసన ఆడిపాడింది. బాలకృష్ణ, రవితేజ, పవన్ కల్యాణ్ లాంటి హీరోల సరసన ఆడిపాడింది. అంతేకాదు గోరింటాకు లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఏడిపించింది కూడా. ఈ మలయాళ నటిని చాలామంది తెలుగమ్మాయే అనుకుంటారు. అయితే దాదాపు దశాబ్ధ కాలంలో తెలుగు పరిశ్రమను దూరమైన ఈమె… రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. అందుకోసం చాలా బ్రాగ్రౌండ్ వర్క్ కూడా చేశారు. హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో నెట్టింట రెచ్చిపోతున్నారు.
కాగా తాజాగా ఆమె రీ ఎంట్రీకి వేళయ్యింది. త్వరలోనే ఆమె నటించిన తెలుగు సినిమా విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు మీరా జాస్మిన్. తన రోల్ డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్పలేదు. ఆమె ఏ మూవీలో నటిస్తున్నారు..? హీరో ఎవరు..? దర్శకుడు ఎవరు..? లాంటి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీరా జాస్మిన్.. చివరిగా నటించిన తెలుగు మూవీ ‘మోక్ష’. 2013లో రిలీజైంది. ఆ తర్వాత ఆమె మలయాళం సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు ఈమె.
మరిన్ని సినిమా వార్తల కోసం..