Ravi Teja:మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉగాది రోజున టైగర్ నాగేశ్వరరావు బిగ్ అప్డేట్

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్  `టైగర్ నాగేశ్వరరావు`.  ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది.

Ravi Teja:మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉగాది రోజున టైగర్ నాగేశ్వరరావు బిగ్ అప్డేట్
Ravi Teja
Rajeev Rayala

|

Mar 31, 2022 | 5:22 PM

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్  `టైగర్ నాగేశ్వరరావు`.  ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది. ఇటీవలే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఉగాది రోజున (ఏప్రిల్ 2న) మాదాపూర్ లోని నోవాటెల్లో (హెచ్ఐసిసిలో) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. పాన్ ఇండియా చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`తో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్.

టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ సినిమా. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్ట్పురం నాగేశ్వరరావు కథ. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్న సినిమా ఇది. పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను మలుచుకోనున్నాడు. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనబడనున్నాడు.ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. మొన్నామధ్య  రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ భారీ రెస్పాన్స్ సంపాదించి ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. 1970 నాటి కథ కావడంతో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Tiger

మరిన్ని ఇక్కడ చదవండి :

Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో.. Bhavana: చూపు తిప్పుకొనివ్వని అందాల భావన.. అందమే అసూయ పడనే నిన్ను చూసి.. OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu